కంగనాను మెచ్చకున్న చంద్రముఖి
X
2005లో రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. పి.వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ పోస్టర్, అప్ డేట్కు మంచి స్పందన వచ్చింది. దాంతో అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా నటిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. కంగనా లుక్, నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అప్పట్లో చంద్రముఖి పాత్రను పోషించిన జ్యోతిక కంగనాపై ప్రశంసలు కురిపించింది. కంగనా రనౌత్ గొప్ప నటి అని.. ఆమె చంద్రముఖి పాత్రను పోషించడం గర్వంగా ఉందన్నారు. చంద్రముఖి లుక్‌లో ఆమె అద్భుతంగా ఉన్నారని, ఆమె నటనకు తాను అభిమానిని అని చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చంద్రముఖి 2లో లెజెండరీ కమెడియన్ వడివేలు కీ రోల్ పోషిస్తున్నాడు. లేట్ ఆర్ఎస్ శివాజీ నటించిన చివరి సినిమా ఇదే. కాగా, ట్రైలర్ సినీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 17 ఏళ్ల తర్వాత తాను బందీగా ఉన్న గది తలుపులు తెరుచుకోవడంతో.. వేట్టయ రాజాపై చంద్రముఖి పగ ఏలా తీర్చుకుంది అనేది స్టోరీ. మరి ఈ సీక్వేల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.