Home > సినిమా > సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతో.. తల్లిని అయ్యా..! : సినీ నటి

సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతో.. తల్లిని అయ్యా..! : సినీ నటి

సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాతో.. తల్లిని అయ్యా..! : సినీ నటి
X

బాలీవుడ్ స్టార్ నటి కశ్మీరా షా.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది. హిందీ బిగ్ బాస్, నాచ్ బలియే, ఫియర్ ఫ్యాక్టర్ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించింది. కశ్మీరా మొదట 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ అనే వ్యక్తిని పెళ్లాడి.. 2007లో అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు, టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ ను 2013లో రెండో పెళ్లి చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కశ్మీరా.. తన వ్యక్తి గత జీవితం గురించి కీలక విషయాన్ని పంచుకుంది.

2013లో రెండో పెళ్లి చేసుకున్న ఆవిడ.. ఎంత ప్రయత్నించినా తన రెండో భర్తతో పిల్లల్ని కనలేకపోయిందట. ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించినా ఫలితం దక్కలేదట. ఈ క్రమంలో పిల్లలు లేరని బాధ పడుతుండగా.. సల్మాన్ ఖాన్ తనకు ఓ సలహా ఇచ్చారట. ఆ సలహాతో తాను ఇద్దరు పిల్లలకు తల్లిని అయినట్లు చెప్పుకొచ్చింది. ‘సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చని, ఒకసారి ప్రయత్నించమని సల్మాన్ సూచించాడు. దాంతో వెంటనే డాక్టర్లను సంప్రదించి మా ప్రయత్నం మొదలుపెట్టాం. అది సక్సెస్ అయింది. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత తల్లిని అయ్యా’అని కశ్మీరా ఎమోషనల్ అయింది.

Updated : 12 July 2023 12:33 PM IST
Tags:    
Next Story
Share it
Top