Home > సినిమా > ప్రభాస్ రాముడిలా కాదు , కర్ణుడిలా ఉన్నాడు..'ఆదిపురుష్' పై నటి షాకింగ్ కామెంట్స్

ప్రభాస్ రాముడిలా కాదు , కర్ణుడిలా ఉన్నాడు..'ఆదిపురుష్' పై నటి షాకింగ్ కామెంట్స్

ప్రభాస్ రాముడిలా కాదు , కర్ణుడిలా ఉన్నాడు..ఆదిపురుష్ పై నటి షాకింగ్ కామెంట్స్
X

జూన్ 16న ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కబోతోంది. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా ఈ చిత్రంతో బాలీవుడ్‎లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే చిత్ర యూనిట్ తిరుపత వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‎ను నిర్వహించింది. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. వివాదాలతో మొదలైన ఈ సినిమాకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా నటి కస్తూరి ఆదిపురుష్ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

‘ఆదిపురుష్’ చిత్రంపై సీనియర్ నటి కస్తూరి తీవ్ర విమర్శలు చేశారు. " ఈ చిత్రంలో రాముడి అవతారంలో కనిపించిన ప్రభాస్‎ను చూస్తుంటే కర్ణుడిలా కనిపిస్తున్నాడు. ఎక్కడైనా రాముడు, లక్ష్మణులను మీసాలు, గడ్డాలతో చూశామా?. అలాంటిది ఆదిపురుష్‎లో రాముడు మీసాలతో కనిపించడం ఏంటి? అసలు రాముడిని ఇలా చూపించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? తెలుగు సినిమాల్లో ఎంతో మంది దిగ్గజ నటులు శ్రీరాముడి గెటప్‎లో అద్భుతంగా నటించారు.

ఆ పాత్రకు పరిపూర్ణతను అందించారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదిపురుష్‎పై కస్తూరి కాంట్రవర్సీ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది కస్తూరిని సపోర్ట్ చేస్తుంటే మరికొంత మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ లుక్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా, కస్తూరి సినిమా గురించి మరింత తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు.


Updated : 10 Jun 2023 2:24 PM IST
Tags:    
Next Story
Share it
Top