మళ్లీ అదే తప్పు చేసిన కీర్తి సురేష్..ఆ సెంటిమెంట్ అట్టర్ ఫ్లాప్
X
నేను శైలజ మూవీతో మ్యాజిక్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది నటి కీర్తి సురేష్. ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ సొంతం చేసుకుని అందరి దృష్టిలో పడింది. ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉన్నా తన నటనతో, గ్లామర్‌తో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను ఫిదా చేసింది. అందుకే ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. స్టార్ హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే కీర్తి సినిమాల్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. అలా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమా తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో తన నటనకు గాను కీర్తి నేషనల్ అవార్డును సైతం అందుకుంది. మహానటిలో సావిత్రమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత ఈ బ్యూటీకి ఇక ఇండస్ట్రీలో తిరుగుండదని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మహానటి తరువాత కీర్తికి కలిసిరానట్లుంది. ఏ సినిమాలో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా నటించి భోళా శంకర్ కూడా కీర్తికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీంతో కీర్తి పరిస్థితేంటని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముద్దుగా ఉన్నకీర్తి సురేష్ అవకాశాల కోసం బక్కచిక్కిపోయింది. అదే ఆమెకు భారీగా ఎఫెక్ట్ చూపించింది. భామ సన్నబడటంతో ముఖంలో కళ మొత్తం పోయిందంటూ అప్పట్లో ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు. ఇక ఆ తరువాత కీర్తికి రజినీకాంత్ తో నటించే ఛాన్స్ రావడంతో ఆయన చెల్లెలిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ అయిన ఈ భామ కాస్త ఇలా క్యారెక్టర్ రోల్ చేయడం ప్రయోగమే అని చెప్పాలి. పోనీ అది హిట్ అయ్యిందా అంటే అదీ లేదు. ఈ సినిమా కాస్త కీర్తికి పెద్ద డిజాస్టర్ మిగిల్చింది. కీర్తిని ఈ క్యారెక్టర్లో ఫ్యాన్స్ ఆక్సెప్ట్ చేయలేకపోయారు. ఆమె పాత్రకు కనెక్ట్ కాలేకపోయారు. ఆమె నటన పరంగా బాగా చేసినప్పటికీ కథ కథనం అంతా కూడా పాత వర్షన్ లో ఉండటంతో ఈ సినిమా కీర్తి కెరీర్ పై ప్రభావం చూపింది. ఆ తరువాత వరుసగా చేసిన లేడీ ఓరియెంట్ చిత్రాలు చేసి మరింత తప్పు చేసింది కీర్తి సురేష్. రజినీ సినిమా కాబట్టి పేరు వస్తుంది అని అనుకోని కీర్తి చెల్లెలి క్యారెక్ట్ర్ కి ఓకే చెప్పి ఉండొచ్చు. కానీ, భోళా శంకర్ లో కూడా చిరుకు కూడా చెల్లెలిగా నటించి అదే తప్పును రిపీట్ చేసిందంటూ సినీ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ఈ పాత్రకు అసలు కీర్తి ఒప్పుకోకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. భోళాలో చిరు- కీర్తి మధ్య సిస్టర్- బ్రదర్ సెంటిమెంట్ ఎంత బాగా పండినా..వెండితెరమీద హిట్ టాక్ రాబట్టలేకపోయింది. దీంతో అమ్మడి కెరీర్ మరోసారి చిక్కులో పడినట్లు అయ్యింది. ఇప్పటికైనా కీర్తి తన కెరీర్ లో ఆచితూచి అడుగులు వేయాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రొటీన్ సినిమాలు చేయకుండా ఉంటే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు. మరి భోళా ఎఫెక్ట్ తో కీర్తి ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే.