Kiran Rathod : రాత్రికి రమ్మన్నారు.. కిరణ్ రాథోడ్ సంచలన కామెంట్స్..
X
కిరణ్ రాథోడ్.. బిగ్ బాస్ 7లో ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఉన్న ఈమెకు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలు చెప్పింది. ఓ హీరోయిన్ సౌత్ లో ఎంత పాపులరైనా సరే ముంబై వెళ్తే ఎన్నో కష్టాలు పడాల్సిందేనని కిరణ్ రాథోడ్ తెలిపింది. అందుకే తాను బాలీవుడ్కు వెళ్లినా నిలదొక్కుకోలుకపోయానని వివరించింది.
బాలీవుడ్లో క్రేజ్ సంపాదించడం అంత ఈజీగా కాదని కిరణ్ రాథోడ్ చెప్పింది. తనకు బాలీవుడ్ లో ఎన్నో చేదు అనుభవాలు ఎదరయ్యాయని తెలిపింది. ‘‘ మూవీ కాంట్రాక్ట్ మీద సైన్ చేశాక మేకర్స్ అసలు రంగు బయటపడేది. ఈ రోజు రాత్రికి వస్తున్నావ్గా అని అడిగేవాళ్లు. కానీ నేను కాంప్రమైజ్ కాకుండా బయటకు వచ్చేదానిని. ఒక్కసారి ఈ నటన అవసరమా.. బయటకు వెళ్లి ఏదైనా బిజినెస్ చేస్తే బెటర్ అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అన్నీ సమస్యలు తొలగిపోయాయి’’ అని కిరణ్ చెప్పారు.
తన లవ్ బ్రేకప్స్ గురించి సైతం కిరణ్ రాథోడ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. ‘‘అప్పట్లో నేను ఓ వ్యక్తిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాను. కానీ అతడు మంచివాడు కాదని లేట్గా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుంటే ఈ పాటికి నేను చచ్చి చాలాకాలం అయ్యేది. అలాంటివాడి కోసం ఎన్నో ఆఫర్లు వదిలేసుకున్నాను. ఆ తర్వాత ప్రేమించినవాడు కూడా సరైనోడు కాదు. దాంతో అతడితోనూ బ్రేకప్ అయింది. అప్పటినుంచి ఎవరినీ ప్రేమించలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు’’ అని వివరించింది.