Home > సినిమా > Bigg Boss7 : ఉల్టా పల్టాగా ఫస్ట్ వీక్.. ఆమె ఎలిమినేట్..

Bigg Boss7 : ఉల్టా పల్టాగా ఫస్ట్ వీక్.. ఆమె ఎలిమినేట్..

Bigg Boss7 : ఉల్టా పల్టాగా ఫస్ట్ వీక్.. ఆమె ఎలిమినేట్..
X

బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యింది. ఈ సీజన్ సరికొత్తగా ఎవరూ ఊహించనట్లు ఉంటుందని మొదట్లో నాగార్జున చెప్పారు. అయితే నాగ్ చెప్పినదానికి అంతా ఉల్టా పల్టా ఉంది. గత సీజన్ అట్టర్ ఫ్లాప్తో ఈ సారైన షో బాగుంటుంనుకున్న ప్రేక్షకులకు ఫస్ట్ వీక్ నిరాశ కలిగించింది. సాదాసీదా కంటెంట్తో ఫస్ట్ వీక్ షో పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇక అందరు అనుకున్నట్లే కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ 7 ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్గా కిరణ్ రాథోడ్ నిలిచారు. కిరణ్ రాథోడ్ అందరితో కలవకపోవడం, తెలుగు కూడా రాకపోవడం మైనస్ అయ్యింది. దీంతో తొలివారమే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆదివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున హౌస్ లో ఉన్నవారితో ఆటలాడించి సందడి చేశారు. ఇక చివరిలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు. ఎలిమినేట్ అయిన కిరణ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి అందరి పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సీదా.. ఉల్టా..

ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోడ్ ఓ గేమ్ ఆడించారు నాగ్. ఇంట్లో సీదా కంటెస్టెంట్లు ఎవరు? ఉల్టా కంటెస్టెంట్లు ఎవరు? అంటూ కిరణ్‌కు టాస్క్ ఇచ్చారు. దీంతో యావర్ చాలా మంచివాడన్న కిరణ్ షకీలా అందరికంటే మంచివారని వారు సీదా కంటెస్టెంట్స్ అని చెప్పింది. షకిలా తర్వాత ఎక్కువగా శివాజీతో కనెక్ట్ అయ్యానని.. అతను చాలా మంచివాడని.. సీదా ఆట ఆడతాడని తెలిపింది. ఇక శుభ శ్రీ కూడా సీదా కంటెస్టెంట్ అని కితాబిచ్చింది.

ఓవర్ కాన్ఫిడెన్స్.. సెల్ఫీష్

ప్రశాంత్, రతిక, తేజ, శోభలు ఉల్టా కంటెస్టెంట్లు అని కిరణ్ చెప్పింది. ప్రశాంత్ ఓవర్ కాన్ఫిడెంట్‌, రతికకు ఆటిట్యూడ్ ప్రాబ్లం అని కామెంట్ చేసింది. శోభా శెట్టి చాలా సెల్ఫీష్ అని చెప్పిన కిరణ్.. తేజ ఎప్పుడూ నవ్వుతూ బిగ్ బాస్ హౌస్లో తన స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడని.. చాలా కన్నింగ్ అని చెప్పుకొచ్చింది. కిరణ్ వెళ్లిపోవడంతో షకీలా ఎమెషనల్ అయ్యింది. ఆమెను తలుచుకుని బాగా ఏడ్చింది.

వీఐపీ రూం..

అంతకుముందు పవర్ అస్త్ర గెలుచుకున్నందుకు వీఐపీ రూంలో ఉండే ఛాన్స్ సందీప్‌కి బిగ్‌బాస్ కల్పించినట్లు నాగ్ చెప్పారు. అలానే పవర్ అస్త్ర ఉన్నంత మాత్రాన ఏ పని చేయనంటే కుదరదని చెప్పి ఓ మెలిక పెట్టారు. అందులో బ్యాటరీ ఒకటి ఉంటుందని.. ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఇందులో రెడ్ మార్క్ వస్తే.. డేంజర్లోకి వెళ్లిపోతావని హెచ్చరించారు.

ఆ తర్వాత అమ్మాయిలు vs అబ్బాయిలు అంటూ యాక్టివిటీ రూంలో ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా అమ్మాయిలు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటే.. అబ్బాయిల్లో కర్రతో కళ్లకు గంతలు కట్టుకుని.. గజ్జెల శబ్దాన్ని బట్టి వాళ్లని టచ్ చేయాలి. తేజ, అమర్‌దీప్, శోభాశెట్టి ఎవరినీ టచ్ చేయలేకపోయారు. శుభశ్రీ మాత్రం ఏకంగా నలుగురిని టచ్ చేసింది. దీంతో ఈ గేమ్‌లో అమ్మాయిలు విజయం సాధించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. ఇలా ఫస్ట్ వీక్ సాగింది. మరి సెకండ్ వీకైనా ఆడియన్స్కు ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.



Updated : 11 Sept 2023 9:12 AM IST
Tags:    
Next Story
Share it
Top