నటి మహాలక్ష్మికి షాక్..పోలీసుల అదుపులో భర్త
X
కోలీవుడ్ ప్రముఖ టి.వి. నటి మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ను పెళ్లాడి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఈ భామ ఫేమస్ అయ్యింది. భార్యతో పాటు భర్త రవీందర్ కూడా సోషల్ మీడియాలో పాపులారిటీని బాగా సంపాదించుకున్నాడు. వీరికి సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా నటి మహాలక్షికి ఓ పెద్ద షాక్ ఎదురైంది. ఓ చీటింగ్ కేసులో భర్త రవీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యాపారిని మోసం చేసినందుకుగాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ వార్త ఇండస్ట్రీలో సెన్సేషనల్‌గా మారింది.
మీడియా కథనం ప్రకారం...విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుబడి పెట్టి భారీ లాభాలను పొందవచ్చని చెన్నైకి చెందిన బాలాజీ అనే ఓ వ్యక్తిని నమ్మించాడు రవీందర్. అందుకుతగ్గట్లుగా నకిలీ పత్రాలను రెడీ చేశాడు.బాలాజీని ఈ ప్రాజెక్టులో పార్టనర్ చేసుకున్నాడు. అందు కోసం ఆ వ్యక్తి నుంచి రూ. 15.83 కోట్ల డబ్బును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని సెప్టెంబర్ 17, 2020న ఇద్దరూ కుదుర్చుకున్నారు. అయితే పరిస్థితి ఊహించిన విధంగా లేకపోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాలాజీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ రవీందర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తనను మోసం చేశాడంటూ రవీందర్‌పై బాలాజీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా రవీందర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.