Payal Ghosh: బాలీవుడ్‌లో అయితే నా బట్టలిప్పేసే వాళ్లు.. ఎన్టీఆర్ హీరోయిన్
X
టాలీవుడ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నార్త్ ఇండియన్ భామ పాయల్ ఘోష్... బాలీవుడ్‌పై తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది. "థ్యాంక్స్ గాడ్, నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాంచ్ అయ్యాను, ఒకవేళ బాలీవుడ్‌లో లాంచ్ అయ్యి ఉంటే.. నన్ను (హీరోయిన్‌గా)ప్రెజెంట్ చేయడానికి నా బట్టలు విప్పేసేవారు. ఎందుకంటే అక్కడ క్రియేటివిటీ కన్నా అమ్మాయిల అవయవ సౌందర్యంపైనే ఎక్కువ ఆధారపడతారు" సంచలన వ్యాఖ్యలు చేసింది.
పాయల్ ఘోష్(PayalGhosh) తెలుగులో మంచు మనోజ్ పక్కన 'ప్రయాణం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా కలసి నటించిన ఊసరవెల్లి చిత్రంలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. తెలుగులో పాయల్ ఘోష్ ఊసరవెల్లి, ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ లాంటి చిత్రాల్లో నటించింది. సౌత్ చిత్రాలతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
పాయల్ ఘోష్ కొన్ని హిందీ సినిమాలలో నటించినా ఆమెకి అక్కడ అంతగా పేరు మాత్రం రాలేదు. ఇప్పుడు ఆమె సినిమాలు ఓటిటి లో వస్తున్నాయి అని ఆమె ట్వీట్ చేసింది. అలాగే 'ఊసరవెల్లి' సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేట్టు చూడు అని ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ సాంఘీక మాధ్యమంలో పెట్టింది పాయల్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక పాయల్ గతంలో ఎన్టీఆర్ ని ప్రశంసిస్తూ.. తారక్ గ్లోబల్ స్టార్ అవుతాడు అని ముందే ఊహించినట్లు పాయల్ తెలిపింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అది నిజమైందని పాయల్ తారక్ పై ప్రశంసలు కురిపించింది.
Thank god, I got launched in South Film Industry, if I would have got launched in #Bollywood they would have removed my clothes to present me, cos they use female bodies more than their creativity 😔
— Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023
Pls… pls our film should be on @NetflixIndia please do something about it @tarak9999 🥰 #osaravalli pic.twitter.com/wHhJFx6gz1
— Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023