Mohammed Shami : మహ్మద్ షమీని పెళ్లాడుతానంటున్న ఎన్టీఆర్ హీరోయిన్
X
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 16 వికెట్లు పడగొట్టి సీరిస్‌లో టాప్ ఫైవ్ బౌలర్ల లిస్ట్‌లో చేరాడు. అలా భారత్ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా మొత్తం షమీ పేరు మారుమ్రోగుతుంది. ఇక షమీ పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. రెండ్రోజుల క్రితం షమీ భార్య హసీనా.. టీమిండియాకు సపోర్ట్ చేస్తాను కానీ.. షమీకి మాత్రం కాదు అంటూ అతడిపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్లు షమీకి సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి షమీని పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా ఫ్రెండ్ చిత్రగా .. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్ ఘోష్.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి షమీకి ప్రపోజ్ చేసింది. కానీ షమీని పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక షరతు ఇలా పెట్టింది. 'షమీ.. నువ్వు ఇంగ్లిష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ ఒక కండీషన్ పెట్టి ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరొక ట్వీట్ లో 'మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పాలని కోరింది. ముందుగా ఫైనల్స్‌లో భారత్ స్థానం సంపాదించాలి. అక్కడ నువ్వు హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను.' అని పాయల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే షమీకి ఫ్యాన్ అయిపోయిందా.. లేక పబ్లిసిటీ కోసమే ఇలా ట్వీట్ చేసిందా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.
2014లో మహ్మద్ షమీ హసీన్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో షమీ వేధిస్తున్నాడంటూ.. హసీన్ అతనిపై వేధింపుల కేసు పెట్టింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ కేసు విషయంలో ఇటీవలే తీర్పునిచ్చిన కోల్‌కతా కోర్టు.. ప్రతినెలా హసీన్‌కు లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది.