ఏమో అనుకున్నాం కానీ...యాక్టర్ ప్రగతి అసాధ్యురాలే....
X
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అందానికి చిరునామా ప్రగతి. అమ్మ, అక్క, అత్త, ఆంటీ...ఇలా అన్ని పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రగతి ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ గా అవతారం ఎత్తారు. ఎదో సరదాగా జిమ్ కు వెళుతున్నారులే అనుకుంటే ఏకంగా పవర్ లిఫ్టింగ్ లో తన సత్తా చూపిస్తున్నారు.
యాక్టర్ ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈమధ్య చాలా తరుచుగా జిమ్ లో ట్రైనింగ్ వీడియోలు పెడుతున్నారు ప్రగతి. ఏదోలే ఫిట్ నెస్ కోసం అనుకున్నారు అందరూ. కానీ అందరినీ షాక్ చేస్తూ ఓ కొత్త వీడియోను రిలీజ్ చేశారు ఆమె. అందులో పవర్ లిఫ్టింగ్ లో తన టాలెంట్ను చూపించారు. ఇది చూసినవాళ్ళు హమ్మ ప్రగతీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి ప్రగతి. డిగ్రీ చదువుతున్నప్పుడే తమిల సినిమాలో హీరోయిన్గా చేశారు. ఓ ఏడు సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేశారు. ఆతరువాత పెళ్ళి చేసుకుని కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ మహేష్ బాబు బాబి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి రకరకాల క్యారెక్టర్లు చేస్తూ తెలుగులో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలిచారు.
లాక్‌డౌన్ టైమ్ లో ప్రగతి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేసేవారు. అయితే అవన్నీ సరదాకి అనుకున్నారు. కానీ అదంతా పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ లో బాగమని ఇప్పుడు తెలుస్తోంది. రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. ఇది చాలా పెద్ద టార్గెట్... దాన్ని చేరేవరకు తగ్గేదే లే అంటున్నారు ప్రగతి.
ప్రగతి పోప్ట్ చేసిన వీడియో చేస్తుంటే ఆవిడ అనుకున్నది సాధించడానికి పెద్ద దూరం లేదని అనిపిస్తోంది. మూవీస్ లో సాంప్రదాయంగా కనిపించే ఆమెను ఇలా చూడడం కూడా కొత్తగా ఉందని అంటున్నారు చాలా మంది. మొత్తానికి ప్రగతి చేస్తున్న పని మాత్రం నెటిజన్లకు చాలా నచ్చేస్తోంది.