Home > సినిమా > జిమ్‌లో బాహుబలి పాట వింటూ అకీరా నందన్ వర్కవుట్స్

జిమ్‌లో బాహుబలి పాట వింటూ అకీరా నందన్ వర్కవుట్స్

జిమ్‌లో బాహుబలి పాట వింటూ అకీరా నందన్ వర్కవుట్స్
X

తన కొడుకు అకీరా నందన్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేశారు నటి రేణు దేశాయ్. ఆ వీడియోకి ఆసక్తికర కామెంట్ కూడా పెట్టారు. వర్కవుట్ చేసే సమయంలో అర్థం పర్థం లేని ఇంగ్లీష్ సాంగ్స్ వినే బదులు.. తన కొడుకుని మాతృభాషలోని పాటలు వినమని చెప్పినట్లు ఆ పోస్ట్ లో తెలిపారు. తాను జిమ్‌లో వర్కవుట్ చేసే సమయంలో హిందీ మ్యూజిక్ ప్లే చేయాలని అడిగినప్పుడు.. అక్కడున్న వాళ్లు తనని చదువురాని, తెలివితక్కువ దానిలా చూసేవారని, సొంత భాషలో పాటలు వినడం తప్పేంటని ప్రశ్నించారు. తాను అలాంటి కామెంట్స్ ని పట్టించుకోలేదని వర్కౌట్లు చేసేటప్పుడు అర్థం పర్థం లేని ఇంగ్లీష్‌ సాంగ్స్‌కు బదులు మాతృభాషలోని పాటలనే వినమంటూ అకీరాను ప్రోత్సహించేదాన్నని చెప్పారు. ఇప్పుడు అతడిని (వర్కౌట్స్‌ టైమ్‌లో హిందీ/తెలుగు పాటలు వినడాన్ని ఉద్దేశిస్తూ) ఇలా చూడటం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవించి.. ఇదే విధంగా చేస్తారని ఆశిస్తున్నా... అంటూ కామెంట్ చేశారు.






ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను నట వారసుడిగా భావిస్తారు. హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ తో విడాకులయ్యాక ఇద్దరు పిల్లలు(అకీరా, ఆద్య) రేణు దేశాయ్ వద్దే పెరిగారు. తన కష్టార్జితంతో పిల్లలను పెంచి పెద్ద చేశానని రేణు దేశాయ్ అంటారు. ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషన్ తో పాటు ఆర్ట్స్ నేర్పించారు. రేపు వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ లో ప్రోత్సహిస్తానని రేణు అంటున్నారు. ప్రస్తుతం అకీరా టీనేజ్ లో ఉన్నాడు. ఈ ఆరున్నర అడుగుల యంగ్ ఫెలోకి మంచి ఫాలోయింగ్ ఉంది. అకీరాకు మ్యూజిక్‌లో ప్రావీణ్యం ఉంది. చిన్న వయసులోనే ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాడు.



Updated : 26 Jun 2023 10:39 AM IST
Tags:    
Next Story
Share it
Top