గత్యంతరంలేక లొంగిపోయా...క్యాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్ అయిన మరో నటి
X
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది తారలు, సింగర్స్ ముందుకు వచ్చి ఇండస్ట్రీలో కాంప్రమైజ్‌ల గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే నటీమణుల నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరు ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. అవకాశాలు కావాలంటే..కాంప్రమైజ్ కావాలని అడిగారంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సినీ రంగంలో హీరోయిన్ల విషయంలో ఆశగా చూసే కళ్ళు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి నటికి ఇబ్బందులు తప్పవు. స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతోమంది.. ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నవారే అని చెబుతూ ఉంటారు . తాజాగా మలయాళ నటి రేష్మ ప్రసాద్ తనకు ఎదురైన అనుభవాలని వివరించి పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది.
భారతి కన్నమ్మ 2 అనే మలయాళ సీరియల్‌తో ఫేమస్ అయ్యింది నటి రేష్మ ప్రసాద్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటిగా తనకు ఎదురైన అనుభవాలను, క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడుతూ... చిన్న చిన్న క్యారెక్టర్స్‌కు కూడా అడ్జస్ట్‌మెంట్స్ అడిగిన వారు ఇండస్ట్రీలో ఉన్నారు . కొందరైతే అడ్జస్ట్‌మెంట్ ఉంటేనే క్యారెక్టర్ వస్తుందని చాలా ఓపెన్‌గా అడిగారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆడిషన్స్‌కు వెళ్లిన ప్రతి చోట ఇదే ప్రశ్న ఎదురయ్యేది.. గదిలోకి రావడానికి అడ్జెస్ట్మెంట్ అయితే.. ఆ పాత్ర నీదే అని చెప్పేవారు. కొన్ని అప్లికేషన్స్ ఫామ్స్‌లో అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా.. ? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉంది. అందులో ఒప్పుకోను అని రాసినా సరే..నా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి మరీ అడిగేవారు. తీవ్ర ఒత్తిడి చేసేవారు . ఆ ఒత్తిడి తట్టుకోలేక వారితో అడ్జెస్ట్ అవ్వడానికి ఒప్పుకున్నాను. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే.. పైకి కనిపించేది వేరు.. ఇండస్ట్రీలో జరిగేది వేరు. తమను స్క్రీన్ మీద చూసుకోవాలని కోరుకునే అమ్మాయిలకు ఇప్పుడైనా ఇండస్ట్రీ మంచి వాతావరణాన్ని కల్పించాలని చెబుతున్నాను" అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.