Home > సినిమా > సమంత బాయ్ ఫ్రెండ్ అతడేనా..?.. ఫొటో వైరల్

సమంత బాయ్ ఫ్రెండ్ అతడేనా..?.. ఫొటో వైరల్

సమంత బాయ్ ఫ్రెండ్ అతడేనా..?.. ఫొటో వైరల్
X

సమంత.. చైతూతో విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. విడాకుల తర్వాత ఈ అమ్మడు వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఖుషి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్లోనూ నటించింది. మరోవైపు సామ్ మయోసైటిస్ జబ్బుతో బాధపడుతోంది. దీనికి చికిత్స తీసుకునేందుకు తన తల్లితో కలిసి అమెరికా వెళ్లింది. అ

అటు సోషల్ మీడియాలోనూ సామ్ యాక్టివ్గా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్.. నెట్టింట వైరల్గా మారింది. జిమ్లో కసరత్తులు చేస్తున్న ఫొటోను సామ్ పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో సామ్ పక్కనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే అతడు ముఖం అటువైపు ఉండగా.. వెనుక నుంచి ఉన్న ఫొటోను సామ్ షేర్ చేసింది. దీంతో అతడు ఎవరని నెటిజన్లు ఆరా తీస్తున్నానరు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు సామ్ కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు సమంత రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఏం మాయ చేశావే మూవీతో కలిసిన సమంత - నాగచైతన్య ఆ తర్వాత ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో నాలుగేళ్లకే విడిపోయారు. వీరు విడిపోయిన వీళ్ల మీద వార్తలు మాత్రం ఆగడం లేదు. అప్పటినుంచి ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Updated : 22 Aug 2023 10:29 PM IST
Tags:    
Next Story
Share it
Top