Home > సినిమా > సమంత న్యూయార్క్ వెళ్లింది ఇందుకే..పిక్స్ వైరల్

సమంత న్యూయార్క్ వెళ్లింది ఇందుకే..పిక్స్ వైరల్

సమంత న్యూయార్క్ వెళ్లింది ఇందుకే..పిక్స్ వైరల్
X

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఈ మధ్యనే బాలీ టూర్‎కి వెళ్లి అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేసిన సామ్ ఖుషీ మ్యూజికల్ కన్సర్ట్ అనంతరం న్యూయార్క్ చెక్కేసింది. అయితే ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ సామ్ అమెరికా వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారింది. గత కొన్నాళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతోంది సామ్. ఈ నేపథ్యంలో ఆమె అమెరికా టూర్‎పై ఒక్కొక్కరు ఒక్కో వార్తను ప్రచారం చేస్తున్నారు. సామ్ తన ట్రీట్మెంట్ కోసమే అమెరికా వెళ్లిందంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. మరి ఈ టూర్ వెనక ఉన్న అసలు విషయం ఇప్పుడు తెలిసిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేయడంతో అసలు విషయం బయటపడింది.

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం న్యూయర్క్‌లో పెద్ద ఎత్తున 'ఇండియా డే పరేడ్' వేడుకలను అక్కడ నివసిసతున్న భారతీయులు జరుపుకుంటారు. ఈ వేడుకలు ఈ ఆదివారం మధ్యాహ్నం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు నిర్వాహకులు. ఈ వేడుకల్లో నటి సమంత స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్‎తో పాటుగా ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

పరేడ్‎లో భాగంగా సమంత మాట్లాడుతూ.. " ఈ రోజు ఇక్కడ ఉండటం నిజంగా గౌరవంగా ఉంది. భారత సంస్కృతి, వారసత్వం ఎంత గొప్పదో మీరు అర్థమయ్యేలా చేశారు. ఈ క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేనే. నా మనస్సులో జీవితాంతం గుర్తుంటాయి. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా కెరీర్‎లో నాకు సపోర్ట్‎గా నిలిచినందుకు స్పెసల్ థ్యాంక్స్. నా ప్రతి చిత్రాన్ని ఆదరిస్తున్న అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు"అని సమంత తెలిపింది.

ప్రస్తుతం సమంత ఖుషీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు ఖుషీపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 1న వెండితెరమీద ఖుషీ సందడి చేయబోతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‎లో సామ్ పోలీస్ ఆఫీసర్‎గా కనిపించనుంది.



Updated : 21 Aug 2023 7:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top