Home > సినిమా > సమంతకు కోపమొచ్చింది... అబ్బబ్బ ఎన్ని నీతులు వల్లించిందో..

సమంతకు కోపమొచ్చింది... అబ్బబ్బ ఎన్ని నీతులు వల్లించిందో..

సమంతకు కోపమొచ్చింది... అబ్బబ్బ ఎన్ని నీతులు వల్లించిందో..
X

సమంత, విజయ్ దేవరకొండల తాజా చిత్రం ‘ఖుషీ’సెప్టెంబర్ 1న విడుదల కానుంది. మూవీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే సమంత వీటికి దూరంగా ఉండడంతో విమర్శలు వస్తున్నాయి. కోట్లు పారితోషికం తీసుకుని సినిమా గురించి పట్టించుకోవా అని కామెంట్లు పెడుతున్నారు జనం. దీంతో ఆమెకు కోపమొచ్చింది. ‘‘మీ పని మీరు చూసుకోండి’’అని రగిలిపోతూ ఇన్‌స్టాలో చేంతాడంత పోస్ట్ వదిలింది. ‘శాకుంతలం’ప్లాప్ కావడంతోపాటు, తన మయోసైటిస్ వ్యాదిపైనా విమర్శలు, అసత్యాలు ప్రచారం అవుతుండడంతో ఇప్పటికే భగ్గుమంటున్న సమంత.. ఖుషీ విషయంలో తనపై విమర్శలు రావడాన్ని ఏమాత్రం జీర్ణించులేకపోతోంది.

‘‘మీరు బతాకాల్సింది ప్రపంచం కోసం కాదు. మీరు మీలాగే ఉండండి. ఒకరు చెప్పినట్లు కాకుండా మీ ఆశయాల సాధనకే కష్టపడండి. మీరు ఉత్సాహంతో, అంకిత భావంతో, నిబద్ధతతో చేసేదే అసలైన పని, మిమ్మల్ని, మీ కృషిని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. గుర్తింపు కోసం మీరు మీకు భిన్నంగా ఉండకూడదు. గుంపులో గోవిందా అన్నట్టు కాకుండా మీరు ప్రత్యేకంగా నిలబడాలి. బిరుదులు, ప్రశంసలు ముఖ్యం కాదు. మీ ఆత్మానుసారం నడుచుకోవడమే ముఖ్యం. గుర్తింపుతో విలువ పెరుగుతుందిగాని ఆత్మతృప్తి దక్కదు. సమాజానికి కాదు, మీ ఆత్మకు లొంగిపోండి. మీకు ఏది అవసరమో మీ హృదయం నివేదిస్తుంది. ఇది సమాజానికి అర్థం కాకపోవచ్చు. మందలో పడకుండా మీ అంతట మీరు చక్కగా పనిచేసుకోవడమే ఉత్తమం’’ అని కోట్ పెట్టింది. ‘‘ఖుషీ’ తప్ప దక్షిణాది పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సమంత ప్రస్తుతం బాలీవుడ్‌ పైనే దృష్టి సారించింది. ఆమె నటించిన ‘సిటాడెల్’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

Updated : 14 Aug 2023 10:22 AM IST
Tags:    
Next Story
Share it
Top