బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో షకీలా..!
X
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి షో ప్రారంభం కానుంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవడంతో సీజన్ 7ను గ్రాండ్ సక్సెస్ చేయాలని టీం భావిస్తోంది. ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్తో ఈసారి షో కొత్తగా ఉంటుందంటూ ప్రేక్షుకల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రోమోలు కొంత బజ్ క్రియేట్ చేశాయి.
సోషల్ మీడియాలో లిస్టులు
నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారన్న దానిపై టీం చివరి వరకు సీక్రెట్ గా ఉంచుతుంది. అయితే ఎప్పటి లాగే ఈసారి కూడా సీజన్ 7లో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టేది వీళ్లేనంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో సెలెక్టైన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ లిస్టులు బయటకు వస్తున్నాయి.
అనిల్ కన్ఫామ్
కన్ఫామ్ అయిన కంటెస్టెంట్ల లిస్టులో యూట్యూబర్ అనిల్ జీలా పేరు వినిపిస్తోంది. మై విలేజ్ షోతో సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అనిల్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు ఆయన ఓకే చెప్పారని, యూట్యూబర్ కేటగిరిలో అనిల్ ఎంట్రీ పక్కా అని అంటున్నారు. రైతు బిడ్డను బిగ్ బాస్ హౌస్కు పంపండంటూ కొన్నాళ్లుగా ఇన్ స్టాలో హల్ చల్ చేస్తున్న పల్లవి ప్రశాంత్ పేరు కూడా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో జబర్దస్త్ లో అదిరే అభి టీంలో పనిచేసిన యూట్యూబర్ టేస్టీ తేజకు కూడా కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినట్లు సమాచారం.
బిగ్ బాస్ హౌస్లోకి మోనిత..?
కార్తీక దీపం ఫేం శోభితా శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కనిపించడం ఖాయమని తెలుస్తోంది. సీరియల్ లో మోనిత పాత్ర పోషించిన ఆమెకు మంచి ఆదరణ ఉంది. జబర్దస్త్ నరేష్ కు సైతం బిగ్ బాస్ అవకాశం వచ్చినా ప్రస్తుతం అతను ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆ ప్రోగ్రాంను కాదనుకుని రావాలంటే బాండ్ బ్రేక్ చేసినందుకు భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నరేష్ ఎంట్రీపై అనుమానాలు నెలకొన్నాయి. అతన్ని రింగ్ రియాజ్ తో ప్లేస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రియాజ్ కు మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదన్నది టాక్.
లిస్టులో ముగ్గురు కపుల్స్
ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న కపుల్స్ లిస్టులో ప్రముఖంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అమర్ దీప్ - తేజస్వినీ, ఆట సందీప్ - జ్యోతి, అంజలి - పవన్ లలో ఒక జంట ఈ సీజన్ లో ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అమర్ దీప్, ఆట సందీప్, అంజలికి ఇప్పటికే కన్ఫర్మేషన్ మెయిల్స్ వచ్చాయని టాక్ వినిపిస్తోంది. హౌస్ లో గ్లామర్ డోస్ కోసం, శ్వేతా నాయుడు, రీతూ చౌదరి, నయని పావనిల్లో ఒకరు వచ్చే ఛాన్సుంది.
సీజన్ 7లో షకీలా
యూట్యూబర్ శీతల్ గౌతమన్ తో పాటు హీరో గౌతమ్ కృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒకప్పటి శృంగార తార షకీలా రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెను హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అయితే షకీలా మాత్రం ఇంకా ఓకే చెప్పలేదని సమాచారం. డేట్స్ కుదిరితే ఆమె పక్కాగా హౌస్ లో అడుగుపెట్టే అవకాశముంది. రంగస్థలంలో రాం చరణ్ ఫ్రెండ్ గా నటించిన మహేష్, సింగర్ కేటగిరిలో మోహన భోగరాజు, భోలే షావలి, ట్రాన్స్ జెండర్ కేటగిరిలో జబర్దస్త్ తన్మయి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఎవరెవరు అడుగుపెట్టనున్నారన్నది తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు వేచిచూడాల్సిందే.