Home > సినిమా > ఆ లుంగీ ఏంటమ్మా...శృతి హాసన్‎ను ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆ లుంగీ ఏంటమ్మా...శృతి హాసన్‎ను ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆ లుంగీ ఏంటమ్మా...శృతి హాసన్‎ను ఏకిపారేస్తున్న నెటిజన్స్
X

దక్షిణాది స్టార్ హీరో కమల్ హాసన్ కూతురైనా, ఆ పేరును పెద్దగా ఉపయోగించుకోకుండా తన టాలెంట్‎తో ఇండస్ట్రీలో రాణిస్తోంది నటి శృతి హాసన్. తన నటనతో, మ్యూజిక్‎తో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచేస్తోంది. తండ్రికి తగ్గ తనయ అని నిరూపించుకుంటోంది ఈ బ్యూటీ. టాలీవుడ్, కోలీవుడ్‎లోని దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అమ్మడు తన నటనతో వావ్ అనిపించింది. ఇందుల్లో కొన్ని సినిమాలు సూపన్ డూపర్ హిట్‎గా నిలిస్తే మరికొన్న దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. గత కొంత కాలంగా టాలీవుడ్‏కు దూరంగా ఉంటున్న శృతి ఈ మధ్యనే విడుదలైన వాల్తేరు విరయ్యతో మరోసారి స్క్రీన్ మీద మెరిసింది. సినిమా హిట్ కాకపోయినప్పటికీ అమ్మడి నటనకు, గ్లామర్‎కు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమె డ్రెస్సింగ్‎పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.




స్టార్ హీరోయిన్ అయినప్పటికీ శృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‎గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను నెటిజన్స్‎తో పంచుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్‎తో గడిపే మధుర క్షణాలను పంచుకోవడం, ఎదైనా కొత్త పాటను రూపొందిస్తూ వాటిని వినిపించడంతో పాటు అప్పుడప్పుడు అదిరిపోయే అవుట్ ఫిట్స్ వేసుకుని హాట్ ఫోటో షూట్లతో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అలా తాజాగా ఈ బ్యూటీ డార్క్ చాక్లెట్ కలర్ లాంగ్ గౌనును వేసుకుని ఈ డ్రెస్‎తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వేసుకోవడానికి వేరే డ్రెస్ ఏమీ లేదా అని తిట్టిపోస్తున్నారు. అది గౌనులా కాదు లుంగీలా ఉందని ఏకి పారేస్తున్నారు. నెట్టింట్లో నెగిటివ్ కామెంట్లు వస్తున్నా శృతి హాసన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది.












Updated : 22 Jun 2023 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top