Home > సినిమా > ఈ 63ఏళ్లు నాన్న అలుపెరుగని పోరాటం చేశారు : శ్రుతి హాసన్‌

ఈ 63ఏళ్లు నాన్న అలుపెరుగని పోరాటం చేశారు : శ్రుతి హాసన్‌

ఈ 63ఏళ్లు నాన్న అలుపెరుగని పోరాటం చేశారు : శ్రుతి హాసన్‌
X

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆయన..పాత్ర ఏదైనా న్యాయం చేయగల బెస్ట్ పెర్పార్మర్.. హాస్యాన్ని పండించాలన్నా..హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా..విలనిజాన్ని చూపించాలన్నా ఆయనకు ఆయనే సాటి.. తన టాలెంట్‎తో తమిళ చిత్ర రంగంలో 230 సినిమాల్లో హీరోగా నటించి తిరుగులేని నటుడిగా ఎదిగారు కమల్ హాసన్. తెలుగు ప్రజల హృదయాలను సైతం గెలుచుకున్నారు ఈ సౌత్ స్టార్ హీరో. కమల్‌ హాసన్‌ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి నేటికి 63 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లేటెస్ట్‎గా కమల్ హాసన్ కూతురు , యువ నటి శ్రుతిహాసన్ కూడా తన తండ్రి సినీ కెరీర్‎పైన ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

కమల్‌ హాసన్‌ సినీ ఇండస్ట్రీలో 63 ఏళ్లు పూర్తి చేసుకుని 64 ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ఎడిట్‌ చేసిన ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్‎ను శ్రుతి తన ట్విటర్ అకౌంట్‎లో షేర్ చేసింది. ‘‘ నాన్న తన సినీ కెరీర్‎లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నారు. ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. చిత్ర పరిశ్రమ బాగుండాలని, దాని ఎదుగుదల కోసం ఆయన నిత్యం అలుపెరుగని పోరాటం చేశారు. 60 ఏళ్లుగా సినీరంగానికే ఆయన సేవలను అందిస్తున్నారు’’అని శ్రుతి తెలిపింది. శ్రుతి పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్వీట్‎కు రిప్లైగా సినీప్రముఖులు, నెటిజన్లు కమల్‌ హాసన్‌తో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆయనతో ఉన్న అనుభందాన్ని షేర్ చేస్తున్నారు.

కమల్ హాసన్ లేటెస్టుగా ‘ఇండియన్‌2’ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని శంకర్‌ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీలో యువ కథానాయికలు కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నారు. త్వరలోనే ఇండియన్ 2 టీజర్‌ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా కమల్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‎లో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’లోనూ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో కమల్ నెగిటివ్ షేడ్‎లో కనిపించనున్నారు.

Ups & Downs, Laurels & Challenges. He's seen it all. But nothing can come between Ulaga Nayagan and his untiring effort to uplift the Industry. The Unparalleled Emperor for 6 decades is stepping into his 64th year in Cinema.#64YearsOfKamalism#KamalHaasan

Updated : 12 Aug 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top