Home > సినిమా > Actress Sri Reddy : తనను సీతమ్మతో పోల్చుకున్న శ్రీరెడ్డి !!

Actress Sri Reddy : తనను సీతమ్మతో పోల్చుకున్న శ్రీరెడ్డి !!

Actress Sri Reddy : తనను సీతమ్మతో పోల్చుకున్న శ్రీరెడ్డి !!
X

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూషల వివాహం శ్రీలంకలో గ్రాండ్‌గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయగా.. ఒక మహిళ మాత్రం విచిత్రంగా స్పందించారు. ఆవిడ మరెవరో కాదు.. నటి శ్రీరెడ్డి. తాను కేరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేసినట్లు ఆరోపణలు చేసింది. ఈ ఇష్యూ నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా మరోమారు అభిరామ్ పై , అతని కుటుంబంపై పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. " రాముడిని ,సీతని విడదీసిన దేశం , సీతాదేవి శాపాలకు నిలయం ,ఆంజనేయ కోపాగ్నిలో తగలబడిన దేశం ,అశోక వనం లో సీతమ్మా ,రాముని రాకకై తిండి మానేసి ,స్నానం మానేసి దుఃఖితురాలైన ఆ రాక్షస రావణ లంక, శ్రీ లంక లో “దగ్గుబాటి అభిరాం “ పెళ్లి .. వహ్వా వహ్వా ..మన దేశ ఆదర్శ జంట రాములవారిని ,సీతమ్మ వారిని విడదీసిన దేశం లోనా నీ పెళ్లి??ఆహా !దైవ నిర్ణయాన్ని గౌరవిస్తాను..ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే " అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

ఇక అభిరామ్, ప్రత్యూషల పెళ్లి వేడుకకు దగ్గుబాటి కుటుంబం తరలి వెళ్లింది. ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మధ్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వధువు ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువని ఆమె స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ ఇటీవలే హీరోగా ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా హిట్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉంది. దగ్గుబాటి రానా రజనీకాంత్ సినిమా ‘తలైవర్ 170’ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో ప్రాజెక్టు ‘హిరణ్యకశ్యప’ తో కూడా బిజీగా ఉన్నారు.




Updated : 7 Dec 2023 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top