2023లోనూ సమాజం మారదా?..తమన్నా
X
గత కొన్నిరోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘జీ కర్దా’, ‘లస్ట్‌స్టోరీస్ 2’ వంటి బోల్డ్ ప్రాజెక్టుల్లో భామ కనిపించడమే అందుకు కారణం అని చెప్పక తప్పదు. స్టార్ బ్యూటీ తమన్నా ఇలాంటి సినిమాలు చేయడంపై నెటిజన్లు మండి పడుతున్నారు. తమ అసహనాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ ఆన్లైన్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది. నెట్టింట్లో తాను ఎదుర్కొంటున్న విమర్శల గురించి మాట్లాడింది. ముక్కు ముఖం తెలియని కొంత మంది వ్యక్తులు నాపై నెగిటివ్ వార్తలు రాస్తున్నారు. 2023లోనూ సమాజం ఆలోచన మారదా? మేము ఎలా ఉండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? అని తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
" 14 ఏళ్ల వయసులోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ఈ 18 ఏళ్ల సినీ కెరీర్‌లో అడుగడుగున ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నటిగా తొలి అడుగు వేసే టైంలోనే.. ‘‘మీ అమ్మాయిని ఇండస్ట్రీలోకి ఎందుకు పంపుతున్నారు? అక్కడ ఎలా ఉంటుందో తెలుసా?’’ అంటూ చాలా మంది నా పేరెంట్స్‌ని ప్రశ్నించారు. ఒకవేళ ఆరోజు వారి మాటలను వినుంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఇక, ఇప్పుడేమో సోషల్‌మీడియాలో చాలా మంది నాపై కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వాటిని నేను అస్సలు పట్టించుకోను. 2023లో కూడా సమాజం మారదా? మేము ఎలా ఉండాలో మీరు ఎలా చెబుతారు?. ముక్కు ముఖం తెలియని వారు చేసే నెగెటివ్ కామెంట్స్‌ను హైలైట్ చేస్తూ వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ఆ విషయం నన్ను చాలా బాధిస్తోంది. నా పని విషయంలో విమర్శలు చేస్తే నేను స్వీకరిస్తాను. మరోసారి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతాను. ’’ అని తమన్నా తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని ఉద్దేశించి మాట్లాడింది.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.