Home > సినిమా > Tamannaah Bhatia : పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్...

Tamannaah Bhatia : పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్...

Tamannaah Bhatia : పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్...
X

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి అనేది కామన్. యాక్టర్స్ మధ్య కొత్త కొత్త లవ్ ట్రాక్స్ నడుస్తుంటాయ్. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన నుంచి సింగిల్ గానే మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల నటుడు విజయ్ వర్మ ప్రేమలో పడింది. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. అటు వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతోనూ బిజీ బిజీగా గడుపుతోంది.





ఎంసీఏ, దహాద్, లస్ట్ స్టోరీస్ 2లో నటించిన విజయ్ వర్మను తమన్నా ఏరి కోరి ఎంచుకుంది. విజయ్ వర్మ కోసం 18ఏళ్ల కిస్ రూల్ను కూడా బ్రేక్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ లవ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతను నాకు అన్ని విధాల అండగా ఉంటాడని నమ్మకం కుదరింది. అందుకే ప్రేమించానని అప్పట్లో చెప్పుకొచ్చింది.





ఈ జంట ఇటీవల మాల్దీవుల ట్రిప్కు వెళ్లొచ్చింది. ఇంకేముంది త్వరలోనే పెళ్లిచేసుకుంటారు అని అంతా అనుకుంటుండగా తమన్నా షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని.. కానీ ఇప్పుడు అలాంటి ఉద్ధేశ్యం లేదని తెలిపింది. నటనపై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు వివరించింది.





‘‘వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు. ప్రస్తుతం నటనపైనే ఫోకస్ పెట్టాను. నా సినీ కెరీర్ ఇప్పుడు బాగా సాగుతోంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాను. వాటిపై మాత్రమే దృష్టి పెట్టాను. పెళ్లి గురించి అస్సలు ఆలోచించడం లేదు’’ అని చెప్పింది. ప్రస్తుతం తమ్మన్నా కామెంట్స్ వైరల్గా మారాయి. పెళ్లి ఆలోచన లేకుంటే ప్రేమ ఎందకంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


Updated : 4 Sept 2023 11:09 AM IST
Tags:    
Next Story
Share it
Top