ఓ మై గాడ్ నిమిషానికి రూ.కోటా?..అది చిరంజీవి బ్యూటీ రేంజ్
X
ఇండస్ట్రీలో హీరోకు సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలనే వాదన ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు హీరోకు సమానంగా కాదు అంతకు మించి పారితోషకాన్ని తీసుకునే తారులు ఇండస్ట్రీలో ప్రత్యక్షమవుతున్నారు. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో టైర్ 2 లేదా టైర్ 3 హీరోలు ఎంతలేదన్నా 3 నుంచి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా రూటే సపరేటు. ఈ భామ మాత్రం ప్రత్యేక గీతాల కోసం భారీ మొత్తంలో ప్రొడ్యూజర్ల నుంచి వసూలు చేస్తోందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది .
తెలుగు ఇండస్ట్రీలో ఉర్వశి రౌతేలా హవా కొనసాగుతోంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. తన అందం, అభినయంతో నార్త్ టు సౌత్ అని తేడా లేకుండా అందరినీ కట్టిపడేస్తోంది. వాల్తేరు వీరయ్యలో 'వేర్ ఇజ్ ది పార్టీ' అనే ప్రత్యేక గీతంతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తరువాత యువ హీరో అఖిల్ సినిమా ఏజెంట్ లో వైల్డ్ సాలా అంటూ రెచ్చిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు అమ్మడి తలుపు తడుతున్నాయి. అందులో పవన్ , సాయ్ ధరమ్ తేజ్‌ల బ్రో సినిమాతో పాటు రామ్ నటిస్తున్న స్కందలోనూ ఊర్వశీ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఇలా వరుసగా ఆఫర్లు వస్తుండటంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఫాలో అవుతోంది ఊర్వశి. అందుకోసమే మూడు నిమిషాల పాట కోసం ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటుందట. ఇక ఇప్పుడు ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్, డిమాండ్‌ను బట్టి అంతమొత్తంలో ఇవ్వక తప్పడం లేదట నిర్మాతలకు.