Home > సినిమా > ఛీ ఛీ తిరుమలలో ఇదేం పాడు పని..మరీ ఇంత పబ్లిక్‎గానా...

ఛీ ఛీ తిరుమలలో ఇదేం పాడు పని..మరీ ఇంత పబ్లిక్‎గానా...

ఛీ ఛీ తిరుమలలో ఇదేం పాడు పని..మరీ ఇంత పబ్లిక్‎గానా...
X

తిరుమల సన్నిధిలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‎కు దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు వచ్చన టీం సభ్యులు బుధవారం వేకువజామున అర్చన సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనంతరం ఆలయం బయటికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్‎ను డైరెక్టర్ ఓం రౌత్ కౌగిలించుకుని బుగ్గపై ముద్దులు పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముంబై వెళ్లేందుకు హీరోయిన్‎కు ఫ్లైట్ టైమ్ అవ్వడంతో దర్శన అనంతరం హడవుడిగా బయలుదేరింది. అదే సమయంలో ఓం రౌత్ సాక్షాత్తు శ్రీవారి ఆలయం ముందే కృతి సనన్‎ను గట్టిగా కౌగిలించుకుని బుగ్గపై ముద్దులు పెట్టాడు. దీంతో భక్తులతో సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆధ్యాత్మిక, పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర పోషించిన హీరోయిన్‎తో గుడి ముందు ఈ పనులు ఏంటని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్‎పై మండి పడుతున్నారు. కృతికి ముద్దులు పెట్టిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో డైరెక్టర్‎ను నెటిజన్లు ఓ రేంజ్‎లో ట్రోల్ చేస్తున్నారు.

Updated : 7 Jun 2023 11:15 AM IST
Tags:    
Next Story
Share it
Top