Home > సినిమా > ఆయోధ్యలో 'ఆదిపురుష్‌' సెగలు..సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్

ఆయోధ్యలో 'ఆదిపురుష్‌' సెగలు..సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్

ఆయోధ్యలో ఆదిపురుష్‌ సెగలు..సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్
X

భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్‎ను సొంతం చేసుకుంది. అయితే, విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాను కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. రామాయణాన్ని కించ పరిచారని, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్, రావణ పాత్రలను మలిచిన తీరు బాగోలేదని రామ భక్తులు మండిపడుతున్నారు. వారణాసి నుంచి హరిద్వార్ వరకూ ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

సినిమాలోని డైలాగ్స్ కూడా వివాదాస్పదంగా మారాయి. రీసెంట్‎గా సినిమాలోని డైలాగ్స్ ఏవీ వినసొంపుగా లేవని.. క్యారెక్టర్లకు తగ్గ డైలాగ్స్ రాయలేదని క్షత్రియ కర్ని సేన డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ ముంతాశిర్‎లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఈ సినిమాను రామ జన్మ భూమి అయోధ్యలోనూ నిషేదించాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ప్రేక్షకులను బయటకు పంపిస్తూ సినిమా హాళ్లను మూసివేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమాపై ఆందోళనలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. రామ జన్మభూమి అయోధ్యలోనూ ఆదిపురుష్‎పై ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీరామ సేన కార్యకర్తలు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటున్నారు. కాషాయ జండాలు పట్టుకుని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ..ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న థియేటర్లను మూసివేస్తున్నారు. అయోధ్యలో ఆదిపురుష్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో పలు హిందూ సంస్థలు సినిమాపై మాట్లాడుతూ.." దర్శకుడు అసంబద్ధమైన సినిమా రూపొందించారు. హిందూ సంస్కృతిని కించపరిచాడు. సినిమాలోని డైలాగులు స్వామీజీలకే అర్థం కావడం లేదు. అలాంటిది ప్రజలకు ఏమి అర్థం అవుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలను వక్రీకరించి చూపించారు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ అయోధ్యలో ఆడనివ్వం. ప్రభుత్వం కూడా సినిమాను తాత్కాలికంగానైనా బ్యాన్ చేయాలి" అని కోరుతున్నాయి.

Updated : 20 Jun 2023 11:22 AM IST
Tags:    
Next Story
Share it
Top