ఆదిపురుష్లో ఆ డైలాగ్స్ తొలగింపు.. మరి ఇప్పుడెలా..!
X
ఆది కావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి రోజు నుంచే విమర్శలు ఎదుర్కుంటుంది. కాస్ట్యూమ్స్, డైలాగ్స్, టేకింగ్, సెట్ డిజైనింగ్, మేకప్ ఇలా ప్రతీదాన్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా సినిమాలో ఉన్న డైలాగ్స్ ను ట్రోల్ చేస్తున్నారు. భక్తి సినిమాలో మాస్ డైలాగ్స్ ఏంటని ప్రశ్నిస్తురన్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా రైటర్ మనోజ్ ముంతశిర్ శుక్లా ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చాడు.
‘సినిమాలోని డైలాగ్స్ గురించి ఇంతలా చర్చించాల్సిన అవసరం లేదు. మూవీలోని డైలాగ్స్ గురించి నేను ఎన్ని వివరణలు ఇచ్చినా అవి మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాయి. అందుకే మిమ్మల్ని (ప్రేక్షకుల్ని) ఇబ్బందిపెట్టిన డైలాగ్స్ తీసెయ్యాలని డిసైడ్ అయ్యాం. వాటి స్థానంలో కొత్త డైలాగ్స్ పెడతాం. వచ్చేవారం నుంచి కొత్త డైలాగ్స్ సినిమాలో ఉంటాయి. అయినా డైలాగ్స్ ఏం తప్పుగా రాయలేదు. అన్ని పాత్రలు ఒకేలా ఉండవు. ఆ పాత్రలకు తగ్గట్లు డైలాగ్స్ రాశాం’ అని ట్వీట్ చేశారు.