Home > సినిమా > ఆదిపురుష్ ఎఫెక్ట్..ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..

ఆదిపురుష్ ఎఫెక్ట్..ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..

ఆదిపురుష్ ఎఫెక్ట్..ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..
X

ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‎పై భారీగానే ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద బోల్తా పడటంతో డార్లింగ్ చాలా అప్సెట్ అయ్యాడు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుసగా ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో అభిమానులకు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రభాస్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‎కు దూరంగా ఉండాలని డార్లింగ్ నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కొంత కాలం బాలీవుడ్ దర్శకులతో పని చేయకూడదని అనుకుంటున్నాడట. అంతే కాదు ఇప్పటికే సైన్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ మూవీని కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్‎తో సలార్ మూవీ చేస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‎కు జోడీగా బ్యూటీ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అదే విధంగా ప్రభాస్ , డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్ గా కనిపించనుంది. సీనియర్ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‎లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇవి హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రభాస్ మళ్లీ ఫామ్‎లోకి రావాలని ఆశిస్తున్నారు.



Updated : 2 Aug 2023 9:20 PM IST
Tags:    
Next Story
Share it
Top