Home > సినిమా > 'రామాయణం' సీరియల్‌ను ట్రోల్ చేస్తున్న ఆదిపురుష్ ఫ్యాన్స్

'రామాయణం' సీరియల్‌ను ట్రోల్ చేస్తున్న ఆదిపురుష్ ఫ్యాన్స్

రామాయణం సీరియల్‌ను ట్రోల్ చేస్తున్న ఆదిపురుష్ ఫ్యాన్స్
X

ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజైనప్పటి నుంచీ ఆ మూవీపై ట్రోలింగ్ మొదలైంది. ట్రైలర్‌తో ఆ ట్రోలింగ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చినా.. ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫైనల్ ట్రైలర్‌పై మళ్లీ కొందరు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆ ట్రైలర్‌లో సీతమ్మను రావణాసురుడు అపహరించిన విధానం.. తప్పుగా చూపించారు అంటూ విమర్శిస్తున్నారు. వీటికి సమాధానంగా.. ఆదిపురుస్, ప్రభాస్ ఫ్యాన్స్.. ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చిన రామానంద్ సాగర్ డైరెక్ట్ చేసిన రామాయణం సీరియల్ ను ట్రోల్ చేస్తున్నారు.

అయితే అందులో రావణుడు.. సీతను ఎత్తుకెళ్లే సీన్ ను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. అసలు సీతను రావణుడు టచ్ కూడా చేయలేదు అని చెబుతారు. కానీ ఆ రామాయణం సీరియల్ లో రావణుడు.. సీతను చెయ్యి పట్టుకొని లాగుతూ భుజాన ఎత్తుకెళ్లి తన రథంపై వేసినట్లు చూపించారు. అదే ఈ లేటెస్ట్ రామాయణం ఆదిపురుష్ లో మాత్రం రావణుడు.. సీతను అసలు ముట్టుకోకుండా బంధించి తీసుకెళ్లినట్లు చూపించడం విశేషం. ఈ రెండు సీన్లను పోలుస్తూ.. “ఏది సరైన రామాయణమో తెలుసుకోండి.. సీతమ్మ తల్లిని రావణుడు ఎప్పుడూ ముట్టుకోలేదు. కానీ మీ రామాయణం సీరియల్ మాత్రం ఇలా చూపిస్తోంది.. అయినా మీరు ప్రభాస్ ను, ఆదిపురుష్ ను ట్రోల్ చేస్తున్నారు.. పైగా రావణుడు ఎత్తుకెళ్లే సమయంలో సీతమ్మ తల్లి స్పృహ కోల్పోయింది” అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దీనికి ఆ సీరియల్ లోని క్లిప్ ను జోడించారు. కాగా.. మూడున్నర దశాబ్దాల కిందట దూరదర్శన్ లో వచ్చిన రామాయణం సీరియల్ దేశంలోని ప్రతి ఇంటికీ ఆ ఇతిహాసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.,


Updated : 9 Jun 2023 2:20 PM IST
Tags:    
Next Story
Share it
Top