Home > సినిమా > Adipurush: ఆ సీట్​లో హనుమంతుడి ఫోటో.. పూజలు చేస్తున్నారు

Adipurush: ఆ సీట్​లో హనుమంతుడి ఫోటో.. పూజలు చేస్తున్నారు

Adipurush: ఆ సీట్​లో హనుమంతుడి ఫోటో.. పూజలు చేస్తున్నారు

Adipurush: ఆ సీట్​లో హనుమంతుడి ఫోటో.. పూజలు చేస్తున్నారు
X



రెబల్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం అట్టహాసంగా రిలీజైంది. అమెరికాలో ప్రీమియర్లకు అభిమానులు పోటెత్తారు. ప్రీమియర్లు చూస్తున్న ప్రేక్షకులను సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన తర్వాత ఈ సినిమాపై బజ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు హనుమాన్ కోసం కేటాయించిన సీటును అలా ఖాళీగా వదిలేయకుండా ఆ సీటులో హనుమంతుని ఫోటో లేదా విగ్రహంను ఉంచాలని భావిస్తున్నాయట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రతి రోజూ హనుమంతునికి పువ్వులు సమర్పించి హనుమాన్​ను పూజించాలని అనుకుంటున్నాయిట.

ఇక ఈ రోజు సినిమా చూస్తున్న అభిమానులు... ఎప్పటికప్పడు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మ్యూజిక్‌తో డ్రామా అద్బుతంగా పండింది. యాక్షన్ సీక్వెన్స్‌లో కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ చాలా పూర్‌గా ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. సెకండాఫ్‌ కోసం ఎదురు చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సెకండాఫ్ కోసం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాం. ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆదిపురుష్ ఫస్టాఫ్ బాగుంది. ప్రారంభంలో వచ్చే యానిమేషన్ సీన్లు బాగున్నాయి. శ్రీరాముడి కథ చెప్పిన విధానం బాగుంది. పాటలు, బీజీఎం, సినిమా కథకు సంబంధించిన ఆత్మ ఎక్సలెంట్. ప్రభాస్, కృతి సనన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడక్కడ ఫస్టాఫ్ గుడ్ బాగుంది. విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

'బాహుబలి' తర్వాత డిఫరెంట్ జానర్స్​లో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'ఆదిపురుష్'తో మైథలాజికల్ జానర్​లో తొలిసారి నటించారు. తన కెరీర్​లో ఈ జానర్​లో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్టర్స్.. మైథలాజికల్ స్టోరీలతో ప్రభాస్​ను అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.









Updated : 16 Jun 2023 7:16 AM IST
Tags:    
Next Story
Share it
Top