Home > సినిమా > Adipurush: థియేటర్ల వద్ద 'ఆదిపురుష్' జోష్.. ఫస్టాఫ్ సూపర్

Adipurush: థియేటర్ల వద్ద 'ఆదిపురుష్' జోష్.. ఫస్టాఫ్ సూపర్

థియేటర్ల వద్ద 'ఆదిపురుష్' జోష్.. ఫస్టాఫ్ సూపర్

Adipurush: థియేటర్ల వద్ద ఆదిపురుష్ జోష్.. ఫస్టాఫ్ సూపర్
X


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` సినిమా ఈరోజు రిలీజ్‌ అయింది. ఈ క్రమంలో థియేటర్ల వంద్ పండుగ వాతావరణం నెలకొంది. ప్రభాస్ అభిమానునలు కాషాయ జెండాలతో ర్యాలీగా చేరుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉదయం 4 గంటలకే స్పెషల్ షో ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్రసాద్ ఐమాక్స్, కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన అభిమానులు.. ట్విట్టర్​ వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.ఆదిపురుష్ విజువల్స్​ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కూడా అందవని, సినిమా చాలా బాగుందని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా కనిపించారని మరికొందరు అంటున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్​ స్కోర్, సాంగ్స్​ కూడా బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

రాముడి వనవాసం సీన్లతో ఫస్టాఫ్ మొదలుకాగా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ , 3డీ సీన్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయంటున్నారు. రాముడిగా ప్రభాస్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని, హనుమంతుడి ఎపిసోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందంటున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఎమోషన్ క్యాప్చర్ 3D అనే సరికొత్త టెక్నాలజీ తో ఓ విజువల్ వండర్​ను ఆదిపురుష్ మూవీతో క్రియేట్ చేశారు సినిమా మేకర్స్. ఇందుకు సుమారు 500 కోట్ల రూపాయలు పైగానే ఖర్చయింది. ఇప్పటికే ఆదిపురుష్ నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టాయి. ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా జరుగుతున్నాయి. తొలి రోజు షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.. ‘ఆదిపురుష్‌’ మంచి విజయం అందుకోవాలని టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



Updated : 16 Jun 2023 1:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top