‘ఆదిపురుష్ టీమ్ను తగలబెట్టాలి.. ప్రభాస్ బాడీ చూపించడానికే పనికొచ్చాడు’
X
ప్రభాస్ కథానాయకుడిగా.. ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా విదులైనప్పటినుంచి ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. క్యారెక్టర్ డిజైనింగ్, గ్రాఫిక్స్, డైలాగ్స్, స్టోరీ నరేషన్ ఇలా అన్ని డిపార్ట్ మెంట్ లో ఓం రౌత్ ఫెయిల్ అయ్యాడని అభిమానులు మండిపడుతున్నారు. పలువురు సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమాపై ‘శక్తిమాన్’ నటుడు ముఖేశ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదివనకు ‘ఆదిపురుష్.. ఓ భయానక జోక్’ అని కామెంట్ చేసిన ముఖేష్, తాజాగా సినిమా టీమ్ పై మండిపడ్డారు. రామాయణాన్ని అపహాస్యం చేస్తూ.. ఆదిపురుష్ సినిమాతో తప్పుడు ప్రచారం చేసిన మూవీ టీమ్ మొత్తాన్ని యాబై డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్చోబెట్టి.. వారిని కాల్చేయాలని డిమాండ్ చేశారు. మన దేశ పవిత్రమైన ఇతిహాస గ్రంథాలను అవమానించే హక్కు వాళ్లకెవరు ఇచ్చారని మండిపడ్డారు. రామాయణాన్ని చదవకుండా ఓం రౌత్, రైటర్ మనోజ్ సినిమాను తెరకెక్కించారని, శివుడు రావణుడికి ఇచ్చిన వరం ఏంటో తెలియకుండా సినిమా స్టోరీ ఎలా రాస్తారని ఫైర్ అయ్యారు.