Home > సినిమా > ఆదిపురుష్ ఒక్క టికెట్కు రూ.2వేలు.. ఎగబడి కొంటున్న జనం

ఆదిపురుష్ ఒక్క టికెట్కు రూ.2వేలు.. ఎగబడి కొంటున్న జనం

ఆదిపురుష్ ఒక్క టికెట్కు రూ.2వేలు.. ఎగబడి కొంటున్న జనం
X

హిందు ఇతిహాసం రామాయణం ఆధారంగా.. ఓం రౌత్ డైరెక్షన్ లో, ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల జేబులకు.. ఈ సినిమా చిల్లులు పెడుతోంది. టికెట్ రేట్లు భారీగా పెంచడమే ఇందుకు కారణం. తాజాగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కతాలో టికెట్ రేట్లు ఆకాశానంటాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు రూ. 2వేలు దాటింది. మొదటి రోజు షోకు రూ.2వేలు, రెండో రోజు షోకు రూ.1800 చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సిటీలోని ప్రముఖ మాల్స్ లో టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఫ్యాన్స్... సోషల్ మీడియాలో సంబంధిత స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ముంబైలోని కొన్ని మాల్స్ లో రూ. 2వేల నుంచి మొదలై.. రూ, 1700, రూ. 1500 ఉన్నాయి. బెంగళూరు, కోల్ కతాలో టికెట్ రేట్లు కాస్త బెటర్ అనే చెప్పాలి. అక్కడ రూ. 1000 నుంచి మొదలై.. రూ. 1800 వందల వరకు ఉన్నాయి. ఇంత రేట్లు పెట్టినా జనాలు ఎగబడి కొంటున్నారు. తాజాగా ముంబైలోని అన్ని థియేటర్స్ లో నో టికెట్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి.

Updated : 13 Jun 2023 8:20 PM IST
Tags:    
Next Story
Share it
Top