Home > సినిమా > ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదిపురుష్..ఎప్పుడంటే...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదిపురుష్..ఎప్పుడంటే...

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదిపురుష్..ఎప్పుడంటే...
X

ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్‎లో ఈ సంవత్సరం పఠాన్ తర్వాత విడుదలైన అతిపెద్ద ప్రాజెక్ట్ అదిపురుష్. ప్రభాస్ హీరోగా తొలిసారి చేస్తున్న హిందీ సినిమా ఇది.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు తొలిరోజు షోలన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ గురించి మరో అప్‎డేటెడ్ న్యూస్ వచ్చేసింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. 'ఆదిపురుష్' ఓటీటీ డీటైల్స్ కూడా బయటికి వచ్చేశాయి.





ప్రభాస్ కెరీర్‎లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ డైరెక్షన్‎లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా, రావణుడిగా సైఫ్ నటించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ మిశ్రమ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. రీసెంట్‎గానే ఈ విషయం తెలిసినప్పటికీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లు చెల్లించి మరీ ఈ సంస్థ డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఆదిపురుష్ సినిమాను ఒటీటీలో చూడాలంటూ మాంత్రం ఎంతలేదన్నా 8 వారాల వరకు ఎదురుచూడాల్సిందే. రానున్న రోజుల్లో సినిమాకు వచ్చే రెస్పాన్స్‎ను బట్టి స్ట్రీమింగ్ డేట్స్ మారే అవకాశమూ లేకపోలేదు.




Updated : 16 Jun 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top