ఆదిపురుష్.. ఇచ్చట కాంట్రవర్సీలు క్రియేట్ చేయబడును..!
X
ప్రస్తుతం ఆదిపురుష్ మేనియా నడుస్తోంది. ఈ నెల 16న విడుదలవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ముందు నుంచి ఈ మూవీ వివాదాల మధ్యే నలుగుతోంది. మొదట టీజర్ రిలీజ్ అయినప్పుడు.. తోలుబొమ్మలాటలా ఉందనే కామెంట్ల మధ్య నలిగిన ఈ మూవీ ట్రైలర్తో వాటికి చెక్ పెట్టింది. ఇక అప్పటినుంచి ఈ మూవీపై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఎక్స్పెక్టేషన్స్తో పాటు కాంట్రవర్సీలూ చుట్టుముట్టాయి. ఈ కాంట్రవర్సీలను మూవీ యూనిట్ సృష్టిస్తోందా.. లేక ఓ వర్గం క్రియేట్ చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మూవీ విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ కాంట్రవర్సీలు ఎక్కువవుతున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతిసనన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పవిత్రమైన ఆలయ సన్నిధిలో డైరెక్టర్, హీరోయిన్ వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. పలు హిందూ సంఘాల నేతలు సైతం ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదనే పోస్టర్ వైరల్గా మారింది. రామాయణ పారాయణం చేసే చోట పవిత్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే దళితులకు ఎంట్రీలేదని ఆ పోస్టర్లో ఉంది. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో మూవీ యూనిట్పై దళిత సంఘాలు కన్నెర్రజేశాయి. చివరకు ఇది ఫేక్ పోస్టర్ అని మూవీ యూనిట్ ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది.
అయితే ఈ కాంట్రవర్సీలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ పీఆర్ టీం వివాదాలను పరిష్కరిస్తుందా లేక వివాదాలను సృష్టిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కొద్దీ మూవీ యూనిట్ ప్రమోషన్స్ని ముమ్మరం చేసింది. ఈ ప్రమోషన్స్తో పాటు కాంట్రవర్సీలతో మరింత హైప్ తెచ్చేందుకు పీఆర్ టీం ఇటువంటి జిమ్మిక్కులకు పాల్పడుందా అనే డౌట్స్ వస్తున్నాయి. పాజిటివ్ లేదా నెగిటివ్ ఏదైనా సరే సినిమా పేరు ప్రజల నాలుకలపై నానేలా పీఆర్ టీం ప్లాన్ చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఇన్నీ కాంట్రవర్సీల నడుమ రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.