అక్కడ ఇరగదీస్తున్న ఆదిపురుష్..రికార్డు స్థాయిలో కలెక్షన్లు
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా , రావణాసురిడిగా సైఫ్ నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారతీయుల రామాయణ గాథను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాడు. రామాయణ కథ కావడం, ప్రభాస్ రాముడిగా నటించడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ క్రేజ్ ఏర్పడింది. అందుకే వరల్డ్ వైడ్‌గా 7500 స్క్రీన్లకుపైగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా, రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతూ దుమ్ముదులుపుతోంది. మొదటిరోజే రూ. 150 కోట్ల మార్క్‌ను అందుకుని ఆదిపురుష్ అదరగొడుతోంది.
ప్రస్తుతం వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ రూ. 250 కోట్లకు చేరవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన బాహుబలి 2, సాహో సినిమాలు మాత్రమే మొదటి రోజు రూ. 100 కోట్లు వసూలు చేశాయి. తాజాగా ఆదిపురుష్ ఆ కలెక్షన్లను దాటడం పక్కా అని తెలుస్తోంది. హిందీలో పఠాన్ తరువాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఆదిపురుష్ కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఆదిపురుష్ రికార్డ్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. ప్రస్తుతం అమెరికాలో 'ఆదిపురుష్' హవా కొనసాగుతోంది. అమెరికా వ్యాప్తంగా ఆదిపురుష్ మొదటిరోజే 1 మిలియన్ ప్లస్ యూఎస్ డాలర్లను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. వీకెండ్ పూర్తయ్యేలోగా యూఎస్‌లో 4 మిలియన్ డాలర్లను ఆదిపురుష్ వసూలు చసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
#Adipurush smashes all the records!! Collects 1 Million + USD Day on First Day! 🙏🏹#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @vishwaprasadtg @vivekkuchibotla @TSeries… pic.twitter.com/YlyHDgmmyk
— People Media Factory (@peoplemediafcy) June 16, 2023