‘హనుమంతుడు అసలు దేవుడే కాదు’.. ఆదిపురుష్ రైటర్ మనోజ్
X
డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించి సినిమా ఆదిపురుష్. ఈ సినిమాలో క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, టేకింగ్.. ఇలా అన్నీ రామాయణాన్ని కించ పరిచేలా ఉన్నాయని హిందూ సంఘాలు చిత్ర బృందంపై మండిపడ్డాయి. దానిపై వివరణ ఇచ్చిన ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ శుక్లా.. తాము తెరకెక్కించింది అసలు రామాయణం కాదని, అందులోని పాత్రలు, కథను తీసుకుని ఫ్రిక్షనల్ గా రాసిన కథ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. రాముడి భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు మనోజ్. హనుమంతుడు అసలు దేవుడే కాదని.. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాడు.
‘హనుమంతుడు అసలు దేవుడే కాదు. ఆయన ఒక భక్తుడు. రాముడి సేవకుడు. అతని భక్తికి శక్తులు వచ్చాయి. కాబట్టి జనాలు ఆయనను దేవుడిని చేశారు. గుళ్లు కట్టి పూజిస్తున్నారు’ అని అన్నారు. అంతటితో ఆగకుండా ‘ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడికి రాసిన డైలాగ్స్ లో తప్పేముంది’ అంటూ తనను తాను సమర్థించుకున్నాడు మనోజ్. ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారానికి తెరలేపాయి. ‘రాముడిని, రామాయణాన్ని కించ పరిచేలా ఓ చెత్త సినిమా తీసి, దేవుళ్లను దేవుళ్లు కాదనే స్థాయికి ఎదిగావా. నీకెంత అహంకారం ఉంటే ఈ మాటలు మాట్లాడతావు’ అంటూ మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మనోజ్, డైరెక్టర్ ఓం రౌత్ లను చంపేస్తామని క్షత్రియ కర్న సేన ఇప్పటికే హెచ్చరించింది. దాంతో ముంబై పోలీసులు మనోజ్ కు భద్రత పెంచారు. అది చాలదన్నట్లు మనోజ్ ఈ విదమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.