చిరంజీవి తర్వాత అడవి శేష్..
X
ఒకప్పుడు స్వయంకృషికి చిరునామా అంటే చిరంజీవిని చూపించారు. కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ అంతా నెపో హీరోసే ఉన్నా.. తమదైన ప్రతిభతో నిలబడి గెలిచిన, గెలుస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో పూర్తిగా సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పే హీరో అడవి శేష్. చిన్న పాత్రలతో వచ్చిన విలన్ గా మెప్పించి హీరోగా మారి.. ప్యాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన అతను.. ప్రతి ప్రయాణంలోనూ తన ముద్రను వేశాడు. ముఖ్యంగా హీరో అయిన క్షణం నుంచి రచనలోనూ ప్రతిభ చూపిస్తూ.. దర్శకుల వర్క్ ను ఈజీగా మార్చాడు. కొన్నాళ్ల క్రితం వరకూ అతను లిమిటెడ్ బడ్జెట్ హీరో. బట్ ఇప్పుడు అన్ లిమిటెడ్ గా అతనిపై ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారట.
అడవి శేష్ సినిమా అంటే ప్రేక్షకులు చాలా చాలా ఇష్టంగా చూస్తున్నారు. థ్రిల్, దేశభక్తి, యాక్షన్ ప్రధానంగానే అతని సినిమాలు కనిపిస్తున్నాయి. అయినా దేనికదే ప్రత్యేకం అనిపించుకున్నాయి. కాన్ స్టంట్ మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు శేష్. గూఢచారితో పాత్ బ్రేకింగ్ సినిమా అందించాడు. ఆ సినిమాకు సీక్వెల్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు కూడా. అప్పట్లో చాలా లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన గూఢచారి ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచింది. కమర్షియల్ గానూ పెద్ద విజయం సాధించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మరోస్థాయిలో ఊహించుకుంటారు. ఆ ఊహలు నిజం కావాలంటే కావాల్సినంత బడ్జెట్ అవసరం. అప్పుడు కష్టమైంది క కానీ ఇప్పుడు కాదు. అందుకే ఈ సారి దాదాపు 80 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతోందట. శేష్ లాంటి హీరోపై ఇది పెద్ద విషయమే. అయినా అతని కెపాసిటీ తెలుసు కాబట్టి ఏమంత రిస్క్ కాదు. పైగా ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ అన్నిచోట్లా వర్కవుట్ అయితే బ్లాక్ బస్టర్ అవడం పెద్ద కష్టమేం కాదు. ఇక దీంతో పాటు అతను చేస్తోన్న మరో సినిమా డెకాయిట్. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఒక స్నీక్ పీక్ వీడియో విడుదల చేశారు. దానికే అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీకి కూడా దాదాపు 70 కోట్లు కేటాయించారట. విశేషం ఏంటంటే.. డెకాయిట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మిస్తోంది. సో.. ఈ రెండు సినిమాల బడ్జెట్ చూస్తే 150కోట్లు. మరి ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా అంటే శేష్ ను ఇండస్ట్రీ ఎంత పెద్ద స్టార్ గా చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రెండూ బ్లాక్ బస్టర్ అయి లాభాలూ తెస్తే.. ఇంక చెప్పేదేముందీ.. శేష్ .. జోష్ మామూలుగా ఉండదింక.