Home > సినిమా > బిగ్బాస్ అనేదే క్రైమ్.. నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్

బిగ్బాస్ అనేదే క్రైమ్.. నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్

బిగ్బాస్ అనేదే క్రైమ్.. నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్
X

బిగ్ బాస్ వివాదం రోజు రోజుకు మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే విన్నర్ పల్లవి ప్రశాంత్, అతని స్నేహితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేశారు. దాడులకు ప్రశాంతే కారణమని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జునపై కూడా కేసు పెట్టి, అరెస్ట్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. బిగ్ బాస్ షో అనేది పెద్ద క్రైమ్ అని, ఇదొక అరాచకం అని వెంటటనీ ఈ షో నిర్వాహకులపై, హోస్ట్ నాగార్జునపై యాక్షన్ తీసుకోవాలని సీపీఐ నారాయణ ఇదివరకే నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షోపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు.. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్.

బిగ్ బాస్ వల్ల ప్రజలపై రెచ్చగొట్టే ప్రభావం జరిగిందని ఆయన పిటిషన్ లో తెలిపారు. సెలబ్రెటీలను, సోషల్ మీడియా వ్యక్తులను అక్రమంగా 100 రోజులు నిర్బంధించడంపై.. నాగార్జునని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ గొడవ వల్ల ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిందని, దానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని అన్నారు. ఈ గొడవ వల్ల ఆర్టీసీ బస్సులు, పలువురి కార్లు ధ్వంసం అయిన విషయం తెలిసిందే.

Updated : 20 Dec 2023 4:44 PM IST
Tags:    
Next Story
Share it
Top