Home > సినిమా > విడాకుల తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్న చైతన్య !!

విడాకుల తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్న చైతన్య !!

విడాకుల తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్న చైతన్య

విడాకుల తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్న చైతన్య !!
X




నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు ఇటీవలే తమ వివాహ బంధానికి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరు విడాకులు తీసుకుంటున్నట్లు చాలా రోజులు నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు క్లారిటీ ఇస్తూ.. మేము ఇద్దరం విడాకులు తీసుకుంటున్నామంటూ అఫిసియల్‌గా అనౌన్స్ చేశారు. విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను కోరారు.

ఇక విడాకుల అనంతరం ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిహారిక ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఏదో ఒక పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటోంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత జొన్నలగడ్డ చైతన్య ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంటారు.

https://www.instagram.com/p/CvJ5zUmMhT3/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

తాజాగా జొన్నలగడ్డ చైతన్య.. తన 33 వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. విడాకుల తర్వాత తొలిసారి తన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలతో పాటు 'ఆల్ త్రీస్ ఇన్‌ స్టైల్‌' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఫోటోలను చూస్తే ప్రకృతిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలో పక్కనే సముద్రం, చెట్లు ఉండగా.. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చైతన్య కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం 'బిగినింగ్ న్యూ లైఫ్‌ బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Updated : 27 July 2023 9:14 AM IST
Tags:    
Next Story
Share it
Top