విశాల్ అవినీతి ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం..?
X
హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాను నటించిన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ విడుదల కోసం సెన్సార్ బోర్డ్ రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ ప్రూఫ్స్‌తో సహా ఓ వీడియోను విడుదల చేశాడు. హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేట్ కోసం మరో రూ.3.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని వీడియోలో స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రిత్వశాఖ స్పందించగా.. తాజాగా సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
విశాల్ నుంచి లంచం డిమాండ్ చేసింది సెన్సార్ సభ్యులు కాదని, థర్డ్‌పార్టీ వారని సెన్సార్ బోర్డు తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి పరిణామాలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పింది. ఈ మేరకు ఈ - సినీప్రమాన్‌ను తీసుకొచ్చిన సెన్సార్ బోర్డు.. దీన్ని వేదికగా దర్శక, నిర్మాతలు తమ సినిమాలకు సెన్సార్ చేసుకోవాలని సూచించింది. సెన్సార్ బోర్డు ప్రతి ఏటా 12 నుంచి 18వేల సినిమాలకు సర్టిఫికెట్ ఇస్తుందని.. ఇప్పటి నుంచి ఎటువంటి అవినీతికి తావులేకుండా తగిన చర్యలు తీసుకుంటామని సీబీఎఫ్ సీ చీఫ్ ప్రసూన్ జోషి స్పష్టం చేశారు.