వయసుతో సంబంధం లేదు ఎవరైనా ఓకే..శ్రీలీల
X
టాలీవుడ్లో ఇప్పుడు పెళ్లిసందడిD బ్యూటీ శ్రీలీల జోరు కనిపిస్తోంది. తెలుగులో ఏ హీరోయిన్‌కు రాని విధంగా క్రేజీ ఆఫర్లు అమ్మడి ఖాతాలో చేరిపోతున్నాయి. వరుసగా స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ చిన్నది. ఓ వైపు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలో ఆయనకు మేనకోడలిగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తూనే..మరోవైపు యవ హీరోలు రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండలతో స్క్రీన్ మీద రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఇలా వరుస ఆఫర్లు రావడం వల్ల స్పెషల్ ఇమేజ్ ఏమైనా పడుతుందని ఎప్పుడైనా భయం కలిగిందా అని ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలను అడగ్గా...తన స్టైల్లో జవాబు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ...‘‘సీనియర్లతో నటించానని ఒకలా..యంగ్ హీరోలతోనే సినిమాలు చేశానని మరొకలా అనుకుని స్టార్స్‌కు ట్యాగ్స్ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రేక్షకులు అసలు ఆ విధంగా ఆలోచించడం ఎప్పుడో మానేశారు. వారు చాలా అప్‌డేట్ అయ్యారు. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. సినిమా అనేది ఒకరు ఊహలోంచి పుట్టుకొచ్చే కథ. దాన్ని తెరకెక్కిస్తున్నారంటే ఆ కథకు తగిన వారినే ఎంచుకుంటారు. అయితే సినిమాలో నటించే నటీనటులు 100కు వంద శాతం న్యాయం చేస్తున్నారా అన్నదే జనాలు చూస్తున్నారు. అది సీనియర్ హీరోనా, లేదా యువ హీరోనా అని ఆలోచించడం లేదు. వారే కాదు ఏ ఆర్టిస్ట్‌కు ఈ ఆలోచన రాకూడదు. వయసును దృష్టిలో రానీయకూడదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశాలు రానేరావు. నాకు అసలు అలాంటి పట్టింపులు లేవు’’. అని శ్రీలీల తెలిపింది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఆదికేశవ’ సినిమాలతో పాటు నితిన్, రామ్, విజయ్ దేవరకొండలతో సినిమాలు చేస్తోంది.