Baby OTT Release Date : ‘బేబీ’ ఓటీటీ రిలీజ్కు డేట్ ఫిక్స్.. ఆ వేదికపై స్ట్రీమింగ్
X
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ బేబీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. హైబడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదు.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా నిరూపించారు. జులై 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు బ్రహ్మరథ పట్టారు. రూ. 14 కోట్ల బడ్జెతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 9 రోజుల్లో 60 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ లభించింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా బేబీ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది.
ఓటీటీ విడుదల తేదీపై మొదట గందరగోళం నెలకొన్నా.. దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలోకి విడుదల చేస్తారనుకున్నారు. దీనికి తెరపడింది. అందరు అనుకున్న తేదీలు కాకుండా ఆగస్టు 18న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. నటీ నటులను అందరూ మొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఓటీటీలో మరింత బోల్డ్ గా బేబీ సినిమా రానుంది. థియేటర్స్ లో సెన్సార్ కట్ చేసిన సీన్స్ ను ఓటీటీలో విడుదల చేయనున్నారు.