Home > సినిమా > ఆ మార్పులతో ఓటీటీలో ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఆ మార్పులతో ఓటీటీలో ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఆ మార్పులతో ఓటీటీలో ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
X

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఏజెంట్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తామని ప్రకటించినా.. చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుంది సినిమా బృందం. థియేటర్ ఆడియన్స్ ను నిరాశ పరిచిన అదే కథను మార్చి మళ్లీ ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అనవసర సీన్స్ తొలగించ.. ఫైనల్ కట్ లో పక్కన పెట్టిన సీన్స్ ను జోడించి కొత్త వెర్షన్ లో ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. జూన్ 23న సోనీలివ్ లో తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఏజెంట్ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది.

Updated : 10 Jun 2023 2:00 PM IST
Tags:    
Next Story
Share it
Top