Home > సినిమా > నా కూతురు సినిమాల్లోకి రాకూడదు-Alia Bhatt

నా కూతురు సినిమాల్లోకి రాకూడదు-Alia Bhatt

నా కూతురు సినిమాల్లోకి రాకూడదు-Alia Bhatt
X

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు ఆలియా భట్. పెద్ద బ్యాగౌండ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ అతి వేగంగా గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పదేళ్ళ సినిమా ఇండస్ట్రీ....విపరీతమైన క్రేజ్, మంచి పేరు అయినా కూడా తన కూతురు మాత్రం ఈ ఇండస్ట్రీలోకి రాకూడదు అని కోరుకుంటోంది ఆలియా.

ఆలియా భట్ ఈ మధ్యనే తల్లి అయింది. రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకుంది. తన గారాల పట్టికి రాహా అని పేరు పెట్టుకుంది ఆలియా. తల్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా చిల్డ్రన్ వేర్ దుస్తుల బ్రాండ్ వ్యాపారంలో కూడా దూసుకుపోతోంది. తాను సినిమాల్లోకి బలవంతంగా వచ్చానని కానీ...తనకి ఈ ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదని, స్ట్రగుల్ ఫేస్ చేశానని కానీ ఆలియా ఎప్పుడూ చెప్పలేదు. కానీ తన కూతురు మాత్రం మూవీల్లోకి రావడం ఇష్టం లేదని చెబుతోంది. తన కూతరు బాగా చదువుకుని గొప్ప సైంటిస్టు కావాలని కలలు కంటోంది.

సినిమాల్లోకి వచ్చాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పింది ఆలియా భట్. పదేళ్ళలో ఎన్నో రోజులు నిద్ర మానుకుని మరీ సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది. కానీ ఇక మీదట అలా ఉండనని...ఇప్పుడు తనకో భర్త, కూతురు ఉన్నారు. వాళ్ళ కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాని చెప్పింది ఆలియా. అలా అని పూర్తిగా సినిమాలు మానేసి కూర్చోనని...కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని చెబుతోంది.

Updated : 24 July 2023 3:37 PM IST
Tags:    
Next Story
Share it
Top