హాలీవుడ్ నటికి ఆలియా భట్ తెలుగు పాఠాలు..వీడియో వైరల్
X
ఆర్ఆర్ఆర్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ఆలియా భట్. రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించి తెలుగు వారి మనుసును దోచేసింది. ఆర్ఆర్ఆర్ కోసం ట్యూటర్‌ను పెట్టుకుని మరి తెలుగు భాషను నేర్చుకొంది. తెలుగును నేర్చుకున్న తర్వాతే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఆలియా భట్ పాల్గొనడం విశేషం. తాజాగా తనకొచ్చిన కొన్ని తెలుగు పదాలను హాలీవుడ్ నటికి ఆలియా నేర్పుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హార్ట్ ఆఫ్ స్టోన్ తో ఆలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా హార్ట్ ఆఫ్ స్టోన్ హీరో, హీరోయన్లకు ఆలియా తెలుగు నేర్పించారు. అందరికీ నమస్కారం, మీకు నా ముద్దులు అని నటి గాల్ గాడోట్ తో ఆలియా భట్ పలికించింది. అదే కార్యక్రమంలో నాటు నాటు పాడి దానికి స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Alia Bhatt teaching Telugu to Gal Gadot was not on my 2023 Bingo card pic.twitter.com/nsr7UJfwIL
— sagar (@alianator07) August 7, 2023