Bigg Boss 7 : రేపే గ్రాండ్ లాంఛ్ 2.0.. బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి...
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఉల్టాపుల్టా కాన్సెప్ట్తో ఈ సీజన్ సరికొత్తగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ మంది కంటెస్టెంట్స్ తో షో ప్రారంభించిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ వీకెండ్ సర్పైజ్కు ప్లాన్ చేశారు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూలేనట్లుగా ఎవరూ ఊహించని విధంగా హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పంపనున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవడంతో నిర్వాహకులు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ షోను గ్రాండ్ సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. గ్రాండ్ లాంఛ్ సందర్భంగా 14 మంది కంటెస్టెంట్స్ను హౌస్లోకి పంపగా.. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వీకెండ్ లో జరిగే ఎలిమినేషన్ తో కంటెస్టెంట్స్ సంఖ్య 9కి తగ్గిపోతుంది. అయితే ఆట ఇంకా 9 వారాలు మిగిలే ఉంది. దీంతో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అయినా చివరి వారానికి కేవలం ఒక్కరే మిగులుతారు. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ ప్లాన్ ఏంటన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఆ క్రమంలో సెప్టెంబర్ 8 ఆదివారం రోజున బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
గ్రాండ్ లాంఛ్ 2.0
సీజన్ 7 మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు గ్రాండ్ లాంఛ్ 2.0కు సిద్ధమైనట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆదివారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0 ప్రసారం చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటు స్టార్ మా, అటు హాట్ స్టార్లో ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయకపోయినా ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఏడుగురు కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఏడుగురు కొత్త సభ్యులు
బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ లాంఛ్ 2.0లో అమీర్ పేటలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అశ్వినీ శ్రీ, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ నయని పావని నయని పావనీ, సీరియల్ యాక్టర్స్ పూజా మూర్తి, అంబటి అర్జున్, సింగర్ బోలే షావలి, బజర్దస్త్ నుంచి కెవ్వు కార్తీక్ హౌస్ లోకి వెళ్లనున్నారట. నిజానికి సీరియల్ యాక్టర్ అంబటి అర్జున్, సింగర్ బోలే షావలి, పూజామూర్తి సీజన్ ప్రారంభంలోనే హౌస్ లోకి వెళ్తారని టాక్ వినిపించింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో అర్జున్, బోలే షావలి షోకు వెళ్లలేదు. పూజా మూర్తి తండ్రి ఆకస్మిక మరణంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లలేకపోయారు.
అంజలి పవన్ వెనకడుగు
ఇదిలా ఉంటే మరో సీరియల్ నటి అంజలి పవన్ సైతం గ్రాండ్ లాంఛ్ 2.0లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో ఆమె ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్లో ఉన్న సీరియల్ బ్యాచ్ ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్లపై వారి ఆట తీరు కారణంగా బయట ఊహించనంత నెగిటివిటీ వచ్చింది. ఒకవేళ తాను షోలోకి వెళ్తే ఆ ప్రభావం తనపైనా పడుతుందని, అది కెరీర్పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుందన్న భయంతో అంజలి పవన్ వెనకడుగు వేసినట్లు సమాచారం. లాస్ట్ మినిట్ లో హ్యాండిచ్చిన అంజలి పవన్ స్థానంలో ఎవరిని రీప్లేస్ చేశారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తమ్మీద గ్రాండ్ లాంఛ్ 2.0తో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్న ఏడుగురు కొత్త సభ్యులు ఆటను మరింత రంజుగా మారుస్తారా లేక వీళ్లనెందుకు తెచ్చార్రా బాబు అని ప్రేక్షకులు తలపట్టుకునేలా చేస్తారా అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే..