Home > సినిమా > సమ్మర్‌లో ఆ సినిమాలన్నీ వాయిదా?

సమ్మర్‌లో ఆ సినిమాలన్నీ వాయిదా?

సమ్మర్‌లో ఆ సినిమాలన్నీ వాయిదా?
X

సమ్మర్ వచ్చేసింది. సమ్మరంటేనే గుర్తుకొచ్చేది వేసవి సెలవులు, స్టార్ హీరోల సినిమాలు. వేసవిలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కొత్త సినిమాలన్నీ థియేటర్లలో పోటీ పడతాయి. వేసవి సెలవులు ఉండటంతో ఇక ఫ్యామిలీలంతా కొత్త సినిమాలు చూస్తూ కూల్ అవుతుంటాయి. కానీ ఈసారి అది జరగదని అనిపిస్తోంది. మీరు విన్నది నిజమే. ఈసారి సమ్మర్‌లోనే ఎన్నికలు వచ్చాయి. దీంతో చాలా సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. మే 7న ఒకేసారి 12 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ఉంది. దీంతో ఎన్నికలు అయ్యాకే చాలా సినిమాలు థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

మే 9న ప్రభాస్ 'కల్కి' విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఎన్నికలు ఉండటంతో ఆ మూవీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 4న సుహాస్.. శ్రీరంగనీతులు, 5న విజయ్.. ఫ్యామిలీ స్టార్ మూవీస్ కూడా వస్తున్నాయి. వీటికి ఏ ఇబ్బంది లేదు. ఏప్రిల్ 12న విడుదల కావాల్సిన రామ్ చరణ్ ఆర్సీ17 మూవీ విడుదల కూడా వాయిదా పడినట్లే అనిపిస్తోంది.

ఇవే కాకుండా ఏప్రిల్ 19 తర్వాత సినిమాల విడుదల అనేది ఉంటుందా? లేదా? అనేది తెలియడం లేదు. వాటిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే టాలీవుడ్ లోని బడా సినిమాలన్నీ జూన్ నెల తర్వాతే థియేటర్ల మొహం చూడనున్నాయి. రామ్.. డబుల్ ఇస్మార్ట్, అల్లు అర్జున్.. పుష్ప-2, నాని.. సరిపోదా శనివారం, పవన్.. ఓజీ, ఎన్టీఆర్.. దేవర, నాగ చైతన్య.. తండేల్ సినిమాలు ఎన్నికల తర్వాతనే రిలీజ్ కానున్నాయి. దీంతో కొత్త సినిమాల కోసం సినీ లవర్స్ మరికొంత కాలం వెెయిట్ చేయాల్సిందే.

Updated : 20 March 2024 10:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top