Home > సినిమా > Dynamic Duo: అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో రిపీట్

Dynamic Duo: అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో రిపీట్

Dynamic Duo: అఫిషియల్ అనౌన్స్‌మెంట్.. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో రిపీట్
X

హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కాసేపటి క్రితమే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. గీతా ఆర్ట్స్, హారిక, హసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నాయి ఈ మేరకు మేకర్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు వచ్చాయి.W మూడు సినిమాలు.. ఒకదానికి మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు నెలకొల్పాయి.

చివరగా వీరిద్దరు కలిసి చేసిన ‘అలవైకుంఠపురంలో‘ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే ఈ కాంబో అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. ఈ కొత్త సినిమా పాన్ ఇండియన్ లెవల్లో రూపొందనుంది. ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’లో ఛాన్స్ మిస్సయిన పూజా హెగ్డే బన్నీతో జతకట్టే అవకాశాలున్నాయని టాక్. మరోవైపు భీమ్లా నాయక్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా కనిపించనుందని.. గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన విరూపాక్షతో మంచి విజయాన్ని అందుకుంది సంయుక్తా.





ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా అవ్వగానే త్రివిక్రమ్ బన్నితో సినిమా మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ సినిమాను టీసీరిస్ నిర్మించనుంది. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో రానున్నాయి. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్, తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. రేసు గుర్రం తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయనున్నట్లు లేటెస్ట్ టాక్.

Updated : 3 July 2023 11:12 AM IST
Tags:    
Next Story
Share it
Top