National Best Actor: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. తొలి తెలుగు హీరోగా..
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచారు. 2021 ఏడాదిగానూ 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. పుష్ప మూవీలో నటనకు గానూ ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్కు అవార్డు దక్కింది. దీంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఉత్తమ నటి అవార్డు ఇద్దరి హీరోయిన్లకు వరించింది. అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్(మిమి)లకు అవార్డులు దక్కాయి.
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్- కొమురం భీముడో)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ ( పుష్ప)
ఉత్తమ్ నేపథ్య సంగీతం : ఎం ఎం కీరవాణి ( ఆర్ఆర్ఆర్)
బెస్ట్ పాపులర్ మూవీ : ఆర్ఆర్ఆర్
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ - మాయావా ఛాయావా)