Home > సినిమా > ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్హ..రెండో సినిమాకే లక్షల్లో రెమ్యునరేషన్.. !

ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్హ..రెండో సినిమాకే లక్షల్లో రెమ్యునరేషన్.. !

ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్హ..రెండో సినిమాకే లక్షల్లో రెమ్యునరేషన్.. !
X

మిగతా ఇండస్ట్రీల మాట అటుంచితే.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎంతో మంది సెలబ్రిటీల పిల్లలు సినిమా రంగంలో వారసత్వంగా కొనసాగుతున్నారు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కూడా. అలా నేటి తారలు తమ పిల్లలను ఫ్యూచర్ కోసం రెడీ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ కూరుతు అల్లు అర్హ.. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. శాకుంతలం సినిమాలో భరతుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న అర్హకు.. మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇప్పుడు మరో సినిమాలో నటించబోతోంది. జూ. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. జాన్వి కపూర్ చిన్న నాటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో తన షూటింగ్ మొదలవబోతోందట. ఈ సినిమాలో అర్హ పాత్ర 10 ని.లు ఉంటుందని టాక్. ఈ పది నిమిషాలకు రూ. 20 లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. అంటే నిమిషానికి రూ. 2 లక్షలు అన్నమాట. ఈ వార్తపై క్లారిటీ రావాల్సి ఉంది.

Updated : 16 July 2023 2:36 PM IST
Tags:    
Next Story
Share it
Top