Home > సినిమా > Pushpa2 Dialogue Leaked : సిండికేట్ మొత్తం సెట్ చేయాలి.. పుష్ప -2 లీక్ డైలాగ్స్ అదుర్స్

Pushpa2 Dialogue Leaked : సిండికేట్ మొత్తం సెట్ చేయాలి.. పుష్ప -2 లీక్ డైలాగ్స్ అదుర్స్

Pushpa2 Dialogue Leaked  : సిండికేట్ మొత్తం సెట్ చేయాలి.. పుష్ప -2 లీక్ డైలాగ్స్ అదుర్స్
X

స్టైలిష్ స్టార్‎గా పేరుతెచ్చుకున్న అల్లుఅర్జున్..పుష్పతో పాన్ ఇండియా రేంజ్‎లో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. పుష్ప రిలీజ్ ముందు వ‌ర‌కు తెలుగు ఇండస్ట్రీకే ప‌రిమిత‌మైన స్టైలిష్ స్టార్.. పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారి ఓ రేంజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించాడు. దీంతో అంద‌రూ పుష్ప 2 కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం పుష్ప ది రూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‎కు పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను రీసెంట్‎గా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. తెలుగు హీరోలకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి..

ఇదే క్రమంలో అల్లు అర్జున్ కోసం ఇన్‎స్టాగ్రామ్ ప్రతినిధులు సైతం హైదరాబాద్‎కు వచ్చారు. ఆయన మీద ఓ స్పెషల్ వీడియోని చేశారు. పుష్ప 2 సినిమా షూటింగ్ సెట్, కాస్ట్యూమ్స్, అల్లు అర్జున్ మేకప్, కారవాన్…ఇలా అన్ని విషయాలను ఆ వీడియోలో చూపించారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్ సీన్ వివరిస్తున్న తీరుని కూడా ఇన్‎స్టాగ్రామ్ ప్రతినిధులు చిత్రీకరించారు. అయితే సుకుమార్ చేతిలో ఉన్న డైలాగ్ పేపర్‎పైనే ఇప్పుడు అందరి చూపు పడింది. వాటిని జూమ్ చేసి చూస్తున్న అభిమానులు అందులో డైలాగ్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని డైలాగ్స్ లీక్ అయ్యాయి. అందులో ఒక డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కేశవ చెప్పిన డైలాగ్‎ను ఇప్పుడు అందరు వైరల్ చేస్తున్నారు. ముందు అయితే నీకు షెకావత్‎కే గొడవ మచ్చా, ఇప్పుడు మొత్తం సిండికేట్ కూడా ఇవ్వాల్వ్ అయ్యింది అని డైలాగ్ పేపర్లో ఉంది. ఇక ఇంస్టాగ్రామ్ వీడియోలో అల్లు అర్జున్ లుక్‎ను కూడా విడుదల చేయడం విశేషం. ఆ లుక్‎లో అల్లు అర్జున్ యాటిట్యూడ్, మేనరిజం ఆకట్టుకునేలా ఉన్నాయి. కూలీ నుండి సిండికేట్ హెడ్‎గా ఎదిగిన పుష్పరాజ్ ఏం చేస్తాడనేది పుష్ప 2 స్టోరీగా తెలుస్తుంది . అలాగే కథకు దర్శకుడు సుకుమార్ ఎలాంటి ముగింపు ఇచ్చాడనేడి ఆసక్తికరంగా మారింది.

ఇక పుష్ప 2 వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. వెయ్యి కోట్ల టార్గెట్‎తో పుష్ప 2 విడుదల కానుంది. ఇక పుష్ప 2లో అల్లు అర్జున్‎కి జంటగా రష్మిక మందన నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పుష్ప చిత్రంలోని పాటలకు దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు..దీనితో పుష్ప -2 సాంగ్స్‎పై కూడా అంచనాలు పెరిగాయి.



Updated : 30 Aug 2023 7:36 PM IST
Tags:    
Next Story
Share it
Top